Leftover Paneer Water Uses : మనం పనీర్ వాటర్‌తో ఉపయోగం లేదని అనుకుంటాం. కానీ వాటితో బోలెడు ఉపయోగలున్నాయి. సాధారణంగా మనం ఇంట్లో చపాతీ పిండిని తడపడానికి నీటిని ఉపయోగిస్తాం. అయితే పనీర్ నీటిని కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. తద్వారా పూరీ, చపాతీ వంటివి మెత్తగా రావడంతో పాటు రుచి కూడా బాగుంటుంది. బేకింగ్ వంటలు చేసుకునే క్రమంలో పిండిని తడుపుకోవడానికీ పనీర్ నీటిని వాడుకోవచ్చు.
కర్రీలలో గ్రేవీ కోసం నీళ్లు పోయడం మనకు అలవాటే! అయితే ఈసారి నీటికి బదులు పనీర్ నీటిని ట్రై చేయండి. అటు రుచీ పెరుగుతుంది, ఇటు అందులోని పోషకాలూ శరీరానికి లభిస్తాయి. కొన్ని కర్రీలు, ఇతర వంటకాలలో పులుపు ఎక్కువైతే కొద్దిగా ఈ నీటిని కలిపి చూడండి, ఫలితం ఉంటుంది. పండ్లు, కాయగూరలతో స్మూతీస్, జ్యూసులు వంటివి తయారుచేసుకునేటప్పుడు సాధారణ నీటికి బదులుగా పనీర్ నీటిని వాడితే రుచి మరింతగా పెరుగుతుంది. పైవాటిలో చక్కెర వేసుకోకపోయినా తియ్యదనం వస్తుంది.
Paneer Water Benefits : నూడుల్స్, పాస్తా, బియ్యం, బంగాళాదుంపలు ఇతర కాయగూరలు వంటివి ఉడికించే క్రమంలోనూ పనీర్ నీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పప్పుల్ని కూడా ఈ నీళ్లలో నానబెట్టుకోవచ్చు. దీంతో ఈ నీటిలోని పోషకాలు ఆయా పదార్థాల్లో చేరి మనకు అందుతాయి. ఉప్మా వంటి టిఫిన్స్ తయారుచేసే క్రమంలో సాధారణ నీటితో పాటు కొంత పనీర్ నీటిని కూడా వాడితే దాని రుచి పెరుగుతుంది.
ఇతర పోషకాలు, ప్రొటీన్లు నిండి ఉన్న పనీర్ నీటిని మొక్కలకూ పోయవచ్చు. అయితే సాధారణ నీటితో కలిపి మాత్రమే వాడాలి. హెయిర్ మాస్కు, ఫేస్ప్యాక్స్ల్లోనూ పనీర్ నీటిని విరివిగా వాడవచ్చు. అలాగే జుట్టును కండిషనింగ్ చేసుకుంటే వెంట్రుకలు పట్టులా తయారవుతాయి. ఇందులోని ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే ఈ చిట్కా పాటించిన తర్వాత జుట్టు జిడ్డుగా మారితే, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
స్నానం చేసే నీటిలో కొంత పనీర్ నీటిని కలుపుకోవడం, బాత్‌టబ్‌లో రెండు కప్పుల నీటిని కలుపుకొని అందులో ఇరవై నిమిషాల పాటు సేదదీరడం వంటివి పాటిస్తే చర్మం సున్నితంగా మారుతుంది. అనంతరం సాధారణ నీటితో మరోసారి స్నానం చేస్తే సరిపోతుంది. కొంతమంది ఇళ్లలోనే కూరగాయల చెత్తతో కంపోస్ట్ ఎరువులు తయారుచేస్తుంటారు. ఈ క్రమంలో పనీర్ నీటిని అందులో పోస్తే ఎరువులోని పోషకాల శాతాన్ని పెంచవచ్చు.
ఉప్మా రవ్వతో నిమిషాల్లోనే వడలు! - టేస్ట్ అద్దిరిపోతుంది - ప్రాసెస్ చాలా ఈజీ! - Rava Garelu Recipe