ETV Bharat / state

డబ్బు వృథాగా ఖర్చు చేస్తున్నారా? - ఈ కథ తెలుసుకుంటే అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లరు!

డబ్బు వృథాగా ఖర్చు చేస్తున్నారా? - ఎలా సేవ్‌ చేసుకోవాలో తెలియట్లేదా? - ఈ స్టోరీ వింటే ఈజీగా అర్థమైపోతుంది.

How To Spend Money Carefully
How To Spend Money Carefully (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How To Spend Money Carefully : దీపావళి.. అన్ని వయసుల వారికి ఉత్సాహాన్ని అందించే పండుగ. మిఠాయిలు, కొత్త బట్టలు ఇష్ట పడనివారు ఎవరుంటారు చెప్పండి. అవి కాకుండా దీపావళి పండుగ అంటేనే టపాకాయలు కాల్చడం. కొందరికి టపాసులు కాల్చడం ఇష్టమైతే, మరికొందరు ఇంటిని రంగురంగుల దీపాలతో అలంకరించడానికి ఇష్టపడతారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు చాలామంది ఇంటికి రంగులేసి, కొత్తగా ముస్తాబు చేసుకుంటారు. మరికొందరు ఇంట్లో ఫర్నీచర్‌ అంతా మార్చేసి కొత్తవి కొనుక్కుంటారు. ఇంకోటి ఏటంటే పండుగ ఆఫర్లు భారీగా ఉంటాయి.

ముహూర్త్‌ ట్రేడింగ్ జరపుతారు : కారు, స్కూటర్‌, టీవీ, ఫ్రిజ్‌ లాంటివి ఈ సమయంలోనే ఎక్కువగా కొంటుంటారు. ఇక ఇన్ని తీసుకుంటున్నప్పుడు వంటింటి సామాను మాత్రం ఎందుకు మార్చకూడదూ అనే గృహిణులు ఉండకపోరు. పప్పు దినుసులు, ఉప్పులు పోసుకోవడానికి ఒకసారి టప్పర్‌ వేర్‌, మరోసారి స్టీల్, ఇంకోసారి గ్లాస్‌ ఇలా ఏది ట్రెండింగ్‌లో ఉంటే వాటిని కొని కిచెన్‌లో పెట్టాలి అనుకుంటారు. దాంతోపాటే డిన్నర్‌ సెట్టూ మార్చేస్తే ఇల్లంతా కొత్తగా, అందంగా ఉంటుంది. ఇంత చేసుకున్నాక బంధుమిత్రులతో ఒక గెట్‌ టూ గెదర్‌ పెట్టుకోకపోతే ఎలా అని అదీ కానిచ్చేస్తారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికీ ఇది పండుగే సుమా! సెలవే అయినా వారి కోసం ప్రత్యేకంగా ఒక గంట సమయం ముహూర్త్‌ ట్రేడింగ్‌ జరుపుతారు.

ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? ఈ 10 టిప్స్ మీ కోసమే! - How To Save Money Fast

ఇన్ని రకాలుగా డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేవారిని చూస్తుంటే చిన్న కథ గుర్తుకొస్తుంది. డచ్‌ దేశం వ్యాపారంగా బాగా రాణిస్తున్న రోజులవి. ఓ వ్యాపారవేత్త విదేశాల నుంచి ట్యులిప్‌ పువ్వుల్ని తెప్పించుకుని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గర్వంగా ప్రదర్శించాడు. అందమైన ఆ కొత్త పువ్వు అతిథుల మనసును దోచుకుంది. దీంతో క్రమంగా ట్యులిప్‌ పువ్వులను ఇంట్లో అలంకరించుకోవడం దేశంలోని సంపన్నులకు ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. వేలం పాటలో బోలెడు డబ్బు వెచ్చించి మరీ సొంతం చేసుకునే స్థాయిలో ఆ పువ్వులకు డిమాండ్ ఏర్పడింది.

భారీగా నష్టపోయిన రైతులు : తర్వాత ఎన్నాళ్లని దీన్ని దిగుమతి చేసుకుంటాం. మనమే పండించుకుందామని మొదలుపెట్టారు. అనంతరం ఎక్కడ చూసినా ట్యూలిప్‌లే. దాంతో ఒక్కసారిగా వాటి మీద మక్కువ తగ్గింది. దీంతో కొనడం ఆపేశారు. విస్తారంగా పండించిన పంటంతా వృథా. ఎగుమతి చేయడానికి అవేమీ నిలవుండే సరకు కాదు కదా. అప్పటివరకూ పెద్ద మొత్తం వెచ్చించి కొన్న వ్యాపారులూ, పెట్టుబడులు పెట్టిన రైతులందరూ తీవ్ర నష్టాల్ని చూశారు. ఈ ఘటన హాలెండ్‌ చరిత్రలో ట్యులిప్‌ బబుల్‌గా మిగిలిపోయింది.

తర్వాత అమ్మితే ఇంకా డబ్బులు రావాలి : ఇప్పుడీ కథ ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే - స్టేటస్‌ చూపించుకోవడానికి డబ్బును రేపు తీసిపారేసే వస్తువుల మీద కాకుండా, అమ్మితే మళ్లీ అంత, లేదా అంతకన్నా ఎక్కువ విలువ ఇచ్చే వాటి మీద ఖర్చు పెట్టాలి. అలాగని ఆర్థికవేత్తలు చెప్పే పాఠమూ, మనం వాడే వస్తువులు భూమాతకు భారం కాకుడదనే పర్యాపరణ ప్రియుల ప్రసంగాలూ గుర్తుకువచ్చాయి అందుకే ఈ చిన్న స్టోరీ.

భవిష్యత్​ కోసం మనీ సేవ్ చేయాలా? ఈ 5 టిప్స్ మీ కోసమే! - Money Saving Tips

మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.