ETV Bharat / state

మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్లు? - ఈ 4 విషయాలు సరిచూసుకోండి! - friends character

How to Know friends envy character : నిత్యం మన పక్కనే ఉంటారు.. మన స్నేహితులుగా మన జీవితాల్లో కలిసిపోతారు.. కానీ, వెనక చేసేవన్నీ వేరే! మనపట్ల అసూయ చూపిస్తారు. మనతోనే మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఎల్లప్పుడూ నెగెవిటీని ప్రదర్శిస్తుంటారు. హద్దులు దాటేసి పర్సనల్​ స్పేస్​ను సైతం ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారిని ఎలా గుర్తుపట్టాలో తెలుసా?

How to Know friends envy character
How to Know friends envy character
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 5:19 PM IST

How to Know friends envy character : రక్త సంబంధీకులు లేని మనిషి ఉంటాడు గానీ.. మిత్రుడు లేని మనిషే ఉండడు! జీవితంలో స్నేహం ఎంత అనివార్యమైనదో తెలుసుకోవడానికి ఈ రెండు వాక్యాలు చాలు. అయితే.. మిత్రుల పేరుతో మన చుట్టూ ఉన్నవారంతా స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్లు కాకపోవచ్చు. మన వెంటే ఉంటూ వెనక గోతులు తవ్వే బ్యాచ్ కావొచ్చు! నోటి నవ్వుతూ నొసటితో వెక్కిరించి రకం కావచ్చు! మరి.. ఆ విషయం ఎలా కనిపెట్టాలో మీకు తెలుసా?

అసూయ..

నిజమైన స్నేహితులు మనం ఓడిపోతే భుజం తడతారు. మనం గెలిస్తే వాళ్లు సంబరాలు చేసుకుంటారు. కానీ.. విషపూరిత స్నేహితులు మీ విజయాలను కూడా విమర్శిస్తారు. ఏదో ఒక వంకచూపుతూ నిత్యం మిమ్మల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టాలని చూస్తుంటారు. ప్రతి దాంట్లోనూ మీపైన గెలవాలని చూస్తుంటారు. హాస్యం పేరుతో మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటారు. అవకాశాలు సృష్టించుకొని మరీ హేళన చేస్తుంటారు. కానీ.. ఒక్కసారి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించరు. నిజమైన స్నేహితులు ఇలా ఎన్నటికీ చేయరు.

మైండ్ గేమ్..

స్నేహితులుగా మీ చుట్టూ ఉంటూనే మీతో మైండ్ గేమ్ ఆడుతుంటారు. మీ సక్సెస్​ను అడ్డుకోవడానికి, మీరు ముందుకు సాగకుండా ఉండడానికి ప్లాన్స్ వేస్తుంటారు. మీరు ఏదైనా సలహాలు సూచనలు అడిగితే.. హార్ట్ ఫుల్​గా స్పందించరు. ఎప్పుడైనా.. ఎవ్వరైనా స్నేహితుడితో గడిపిన తర్వాత మనసుకు హాయిగా ఉంటుంది. రిలాక్స్​గా ఫీలవుతాం. అలా కాకుండా.. మీరు మానసికంగా నిరుత్సాహానికి గురయ్యారంటే మీ స్నేహంలో తేడా ఉన్నట్టు భావించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నెగెటివిటీ..

కొందరు నిత్యం నెగెటివిటీలోనే బతికేస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటారు. విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. జీవితంపై సానుకూల దృక్పథం వారి మాటల్లో ఏ కోశానా కనిపించదు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడుతుంటారు. ఎవరో ఒకరిపై కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు మీ చుట్టూ ఉంటే.. క్రమంగా ఆ ప్రవర్తన మీపై కూడా పడుతుంది. అది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ నెగెటివిటీ మీకూ అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల.. ఇలాంటి వారికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

హద్దులు దాటేస్తారు..

జీవితంలో ప్రతి ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అందులోకి ఎవ్వరూ రాకూడదు. కానీ.. అందుకు విరుద్ధంగా మీ జీవితంలోకి చొరపడతారు. మీ ఇష్టాఇష్టాలకు విలువనివ్వరు. వారికి అనుగుణంగా ఉండాలని ఒత్తిడి చేస్తుంటారు. దాంతోపాటు.. ఎల్లప్పుడూ వారు మిమ్మల్ని కింది స్థాయి వ్యక్తులుగా మాత్రమే చూస్తుంటారు. ఇలాంటి ప్రవర్తనతో మీరు తరచూ ఇబ్బందులు పడుతుంటారు.

ఇలాంటి వారు మీ ఫ్రెండ్ లిస్టులో ఉంటే.. వారితో స్నేహం కొనసాగించడానికి ఆలోచించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. స్నేహం మనకు మద్దుతుగా నిలవాలే తప్ప, మనపై డామినేషన్ చేసేది స్నేహం కాదని చెబుతున్నారు. సో.. మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఓసారి చెక్ చేసుకోండి మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.