How to Apply for inter Results Recounting and Reverification in TS: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను అధికారులు నేడు (ఏప్రిల్ 24) విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, తమకు వచ్చిన మార్కుల పట్ల అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీ-కౌంటింగ్ అంటే ఏమిటి(Recounting): రీ-కౌంటింగ్ అనేది విద్యార్థులు తమ మార్కులతో సంతృప్తి చెందనట్లయితే వారి మార్కులను తిరిగి కౌంట్ చేయమనడానికి అప్లై చేసుకునే ప్రక్రియ. ఫలితాల ప్రకటన తర్వాత నిర్ణీత వ్యవధిలోపు మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థులకు అనుమతిస్తుంది.
రీకౌంటింగ్ వివరాలు:
- రీకౌంటింగ్‌కు అప్లై చేసుకోవాలనుకునేవారు ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌కు సంబంధించి ఒక్కో పేపర్ రీకౌంటింగ్ కోసం 100 రూపాయల ఫీజు చెల్లించాలి.
రీ కౌంటింగ్ అప్లికేషన్ ప్రాసెస్:
- రీకౌంటింగ్‌కు అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులు ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ http://tsbie.cgg.gov.in కు లాగిన్ అవ్వాలి.
- అందులో Students Online Services ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Academic Year కాలమ్‌లో Recounting of Marks ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత హాల్ టికెట్ నంబర్, పేరు వంటి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తరువాత తాను ఏ సబ్జెక్ట్ కోసం రీ కౌంటింగ్‌కు అప్లై చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను పూర్తిస్థాయిలో నింపాలి.
- చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి, రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.
రీ వెరిఫికేషన్(Reverification): రీవెరిఫికేషన్ అనేది విద్యార్థి జవాబు పత్రాన్ని వేరే ఎగ్జామినర్ ద్వారా తిరిగి మూల్యాంకనం చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో, ఎగ్జామినర్ ఆన్సర్ షీట్‌ను మళ్లీ తనిఖీ చేసి, ఇచ్చిన మార్కులను ధృవీకరిస్తారు.
రీ వెరిఫికేషన్ వివరాలు:
- రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకునే వారు ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌కు సంబంధించి ఒక్కో పేపర్ రీ వెరిఫికేషన్ కోసం 600 రూపాయల ఫీజు చెల్లించాలి.
రీ వెరిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్:
- రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులు ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ http://tsbie.cgg.gov.in కు లాగిన్ అవ్వాలి.
- హోమ్ పేజీలో Students Online Services ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- Academic Year కాలమ్‌లో Reverification of Valued Answer Scripts ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత హాల్ టికెట్ నంబర్, పేరు వంటి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తరువాత తాను ఏ సబ్జెక్ట్ కోసం రీ వెరిఫికేషన్‌కు అప్లై చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను పూర్తిస్థాయిలో నింపాలి.
- చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి, రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు - TS Inter Supplementary Exam 2024