ETV Bharat / state

వాషింగ్ మెషీన్​లో బెడ్​ షీట్లు - ఎన్ని రోజులకు ఒకసారి వేస్తున్నారు? - BED SHEETS WASHING TIPS

- తరచూ క్లీన్ చేయకపోతే శ్వాసకోశ, చర్మ సమస్యలు - ఈ టిప్స్ పాటించాలంటున్న నిపుణులు

How to Wash Bed Sheets
How to Wash Bed Sheets (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How to Wash Bed Sheets : బెడ్​ షీట్లు ఉతకడం అనేది పెద్ద పనిగా ఉంటుంది. ఉతకక చాలా రోజులైందని అనిపించి, ఇవాళ ఏ పనీ లేదు అనుకున్నప్పుడు.. ఈ పని పెట్టుకుంటారు. ఈలోగా వారాలు, నెలలు కూడా గడిచిపోతాయి. ఈ గ్యాప్​లో దుమ్ము-ధూళి, కంటికి కనిపించని సూక్ష్మ జీవులు పూర్తిగా పేరుకుపోతాయి. వాటి కారణంగా దగ్గులు, తుమ్ములతోపాటు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు, పలు చర్మ రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. బెడ్​ షీట్లను క్లీన్​ చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, వాయిదాలు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్ని రోజులకు ఒకసారి?

బెడ్‌షీట్లను వారానికి ఒకసారి తప్పకుండా ఉతకాలని చెబుతున్నారు. దీనివల్ల.. కొన్ని చర్మ వ్యాధులు, ఇతర రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే సమస్యలు ఉన్నవారైతే.. బెడ్‌షీట్లను తరచూ మారుస్తూ ఉండాలి. అలాగే.. అవకాశం ఉన్నంత వరకు ఎవరి బెడ్‌షీట్లు వారికి ప్రత్యేకంగా కేటాయించడం మంచిదంటున్నారు.

కొందరు పెంపుడు జంతువులను బెడ్ పైనే పడుకోబెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వాటి వెంట్రుకలు రాలిపడతాయి. వాటి చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు కూడా బెడ్‌షీట్‌కు అంటుకుంటాయి. సాధ్యమైనంత వరకు వాటిని బెడ్‌ మీదికి తీసుకురాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

ఎలా ఉతకాలి..?

దుప్పట్లు శుభ్రం చేసేటప్పుడు వేడినీళ్లు వాడాలని సూచిస్తున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా, ఇతర క్రిములు నశించడంతోపాటు మురికి త్వరగా వదులుతుంది. బెడ్​ షీట్ల నాణ్యత తక్కువగా ఉంటే.. గోరువెచ్చని నీళ్లలో డిటర్జెంట్‌ వేసి, కాసేపు నానబెట్టిన తర్వాత ఉతకాలి.

మురికి పూర్తిగా పోవాలని కొందరు, సువాసన రావాలని ఇంకొందరు, లెక్కాపత్రం లేకుండా ఎంత పడితే అంత డిటర్జెంట్‌ వేస్తుంటారు. ఇలా చేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఎక్కువ మొత్తంలో డిటర్జెంట్ వాడితే.. అందులోని కెమికల్స్ బెడ్‌షీట్‌ క్వాలిటీని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.

ఉతికిన తర్వాత బెడ్‌షీట్లను ఎండలో ఆరేస్తే మంచిది. నీడలో వేస్తే సరిగ్గా ఆరకపోతే తేమవల్ల ఫంగస్‌, బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవి శ్వాస, చర్మ సమస్యలకు దారి తీస్తాయి. పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఐరన్‌ చేస్తే ఇంకా మంచిది. ఏమైనా క్రిములుంటే అవి కూడా నాశనమవుతాయి.

మరికొన్ని జాగ్రత్తలు..

బయటికి వెళ్లొచ్చిన వాళ్లు.. కాళ్లు కడుక్కోకుండానే బెడ్‌పైకి ఎక్కేస్తుంటారు. ఇలా చేయడం వెంటనే ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత, లేదంటే కనీసం కాళ్లు, చేతులు కడుక్కుని, డ్రస్‌ ఛేంజ్ చేసుకున్న తర్వాతనే బెడ్‌పై వెళ్లాలని చెబుతున్నారు.

మంచం మీదనే భోజనం చేయడం, స్నాక్స్‌ తినడం వంటివి కొందరికి అలవాటు. ఇలా చేయడం వల్ల పదార్థాలు బెడ్‌షీట్‌ మీద పడతాయి. సో.. బెడ్‌పై కూర్చొని తినడం ఆపేస్తే మంచిది.

మేకప్‌ వేసలుకునేవారు తప్పకుండా మేకప్ తీసుకున్న తర్వాతనే పడుకోవాలి. కానీ.. కొందరు బద్ధకంతోనో, అలసిపోయామనో.. అలాగే పడుకుంటారు. దీంతో.. మేకప్ కెమికల్స్ బెడ్‌షీట్‌, దిండుకు అంటుకుంటాయి. ఇవి చర్మ రోగాలకు కారణం అవుతాయి. సో.. మేకప్ తొలగించుకున్న తర్వాతే బెడ్ మీదకు వెళ్లడం మంచిది. ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల బెడ్‌షీట్లను క్లీన్​గా ఉంచుకోవచ్చని.. శ్వాస, చర్మ సమస్యలు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాషింగ్​ మెషీన్​లో బట్టలు మాత్రమే కాదు - ఇవి కూడా క్లీన్​ చేయొచ్చు!

వాషింగ్ మెషీన్​లో స్వెట్టర్లు, మఫ్లర్లు వేస్తున్నారా? - ఇలా చేయకపోతే త్వరగా దెబ్బతింటాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.