Untimely Rains in Telangana 2024 : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రెండు రోజుల నుంచి వాతావరణంలో అకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వర్షం కురవగా మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులుతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీంతో పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురిసింది. రెబల్లె గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న బొప్పాయి చెట్లు నెలకొరిగాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితరైతు వెంకటేశ్వర రెడ్డి వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.
Crop Loss Due To Untimely Rains : రాష్ట్రంలో గత రెండు రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం విపరీతంగా ఎండలు సాయంత్రం అకస్మాత్తుగా ఈదురు గాలులు, వర్షాలు పడుతున్నాయి. మరికొన్నిచోట్ల పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. ఇటీవల పిడుగుపాటుకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం జనగామ జిల్లాలో పిడుగుపాటుకు గురై అజయ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వ్యవసాయ బావి వద్ద కట్టి ఉన్న కాడెద్దులపై పిడుగుపడి మృతి చెందింది. మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలకు మామిడి నేలరాలింది.
Crop Damage: అరిగోస.. వానలు ఆగవాయే.. పరిహారం రాదాయే
Impact Of Storms on BJP Meeting : పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో మంథనిలో భారీ జనసభను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కోసం భారీగా షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారీగా ఈదురు గాలులు రావడంతో వేసిన టెంట్లు కుప్ప కూలిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు టెంట్ల కింద నుంచి బయటికి పారిపోయారు. పార్టీ నాయకులు అప్పటికే ప్రసంగాలు పూర్తి చేయగా ముఖ్యఅతిథి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తన వాహనంలోనే ఉండిపోయారు. ఈదురు గాలుల కారణంగా భారీగా ప్రజలు వెళ్లిపోతుండగా ముఖ్యఅతిథి ప్రచార వాహనం పైనుంచి ప్రసంగించారు.
High Wind Havoc in Joint Warangal : ఈదురు గాలుల బీభత్సం.. 150కి పైగా ఇళ్లు ధ్వంసం
Heavy Rains In Telangana : మళ్లీ విరుచుకుపడిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం