ETV Bharat / state

తంబళ్లపల్లెలో పరువు హత్య ? - బాలిక మృతదేహాన్ని పొలంలో కాల్చేసిన బంధువులు ! - MINOR GIRL HONOR KILLING IN AP - MINOR GIRL HONOR KILLING IN AP

Minor Girl Honor Killing In AP : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన మైనర్‌ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఆమె మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మృతదేహాన్ని బూడిద చేయడంలో పెద్ద మనుషులు, పోలీసులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి.

Honour Killing of Minor Girl in Thamballapalle
Minor Girl Honour Killing In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 10:01 AM IST

Honor Killing of Minor Girl in Thamballapalle : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలిక గత నెలలో అదృశ్యం అయ్యింది. తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, బంధువులు, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల తీరు మీదా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చెట్టుకు చున్నీతో ఉరి వేసుకున్న బాలిక : స్థానిక ప్రజలు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మాయి అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమ్మాయిని గుర్తించిన పోలీసులు మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని సర్ది చెప్పి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించడంతో పోలీసులు అమ్మాయిని వారికి అప్పగించారు. తాజాగా పెద్దమండ్యం మండలంలో ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు గొర్రెల కాపరులు సోమవారం గుర్తించి వీఆర్‌వోకి తెలియజేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేరం రుజవైతే నిందితులపై చర్యలు : బాలిక మృతి చెందినట్లు కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పెద్ద మనుషులు భావించారు. ఈ భయంతో పోలీసులను మేనేజ్‌ చేసి, మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చివేసి బూడిద చేశారు. ఈ విషయంపై మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరగా, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాలిక మృతదేహాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పెద్ద మనుషులు, పోలీసుల ప్రమేయంపై విచారణ చేపడతామని వివరించారు.

ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి

అన్నతో మందు సిట్టింగ్ - అలా బయటకు వెళ్లగానే ఆయన ఫ్యామిలీని చంపి సూసైడ్ - TRIPLE MURDER IN TIRUPATI

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.