ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్​కు హైకోర్టులో ఊరట- లుక్​ అవుట్ నోటీసులు సస్పెండ్ - HC Suspends Sahil Look Out notices - HC SUSPENDS SAHIL LOOK OUT NOTICES

High Court Suspends Sahil Look Out Notices : ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్​కు హైకోర్టులో ఊరట లభించింది. సాహిల్​పై ఉన్న లుక్ అవుట్ నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 19 లోగా పోలీసుల వద్ద లొంగిపోవాలని సాహిల్​ను ఆదేశించింది.

High Court Suspends Sahil Look Out Notices

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 9:46 PM IST

High Court Suspends Sahil Look Out Notices : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్​పై లుక్ అవుట్ నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 19 లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సాహిల్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్లను ఢీకొని పారిపోయారన్న కేసులో సాహిల్​పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీస్(Look Out Notice) జారీ చేశారు. ఎల్వోసీ రద్దు చేయాలన్న సాహిల్ పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.

తనపై తప్పుడు కేసు పెట్టారన్న సాహిల్​ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి విచారణకు సహకరించేందుకు ఉన్నట్లు హైకోర్టుకు తెలిపారు. అయితే విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ఎల్వోసీ రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఎల్వోసీని సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 19లోగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు

ఆసలేంటి ఈ కేసు?
గతేడాది డిసెంబర్ 23వ తేదీన వేకువజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అధిక వేగానికి కారు(Car wreck) ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒక వ్యక్తి పరారయ్యారు. ఘటనపై అప్రమత్తమైన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కు తరలించారు. కాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది.

CI Arrest in MLA Shakeel Son Case : పోలీస్​ స్టేషన్​ నుంచి పోలీసుల కన్నుగప్పి సాహిల్‌ తప్పించుకున్నాడు. అయితే ఈ కేసులో నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు పూర్తిగా సహకరించారని బయటపడింది. ప్రజాభవన్, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌(Panjagutta Police Station) వద్ద సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు దీన్ని రికార్డు చేసుకున్నారు. శాఖాపరమైన అంతర్గత విచారణలోనూ దుర్గారావు కేసును పక్కదారి పట్టించాడని, నిందితులను మార్చేందుకు పలువురితో ఫోన్‌లో సంప్రదించి మంతనాలు జరిపినట్లు నిర్దారించారు. దీంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి దుర్గారావు పరారీలో ఉన్నారు. అతని కోసం ఐదు బృందాలుగా పోలీసులు గాలించి ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హైకోర్టు కీలక తీర్పు

ప్రజాభవన్ ముందు జరిగిన కారు ప్రమాదంలో నిందుతుణ్ని తప్పిస్తున్నారా - పోలీసుల పాత్రపై అధికారులు అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.