High Court Refused to Intervene in Municipal No Confidence : రాష్ట్రం వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చెలరేగిన అవిశ్వాసాలపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్‌ను సీజే ధర్మాసనం కొట్టేసింది. అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్లు(Collectors) నోటీసులు ఇవ్వడాన్ని పలు పురపాలక సంఘాలకు చెందిన ఛైర్మన్లు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జోక్యం చేసుకోకపోవడంతో, ధర్మాసనంలో అప్పీల్ చేశారు.
సీజే జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ నిర్వహించింది. మున్సిపల్ చట్టం-2019(Municipal Act) లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి తగిన విధానం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా స్పష్టత లేదన్నారు. నిబంధనలు రూపొందించేదాకా అవిశ్వాస తీర్మానాలు పెట్టకుండా చూడాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
నాలుగేళ్ల తర్వాత కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చని పురపాలక చట్టం చెబుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌన్సిలర్ల మెజారిటీ అభిప్రాయం మేరకు కలెక్టర్లు అవిశ్వాస తీర్మానంపై నోటీసులిచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
TS Sarpanches Approached to High Court : గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం(Congress Govt) ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తమ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టును కోరారు.
సర్పంచుల పదవీకాలం ఇవాళ్టి(జనవరి 31)తో ముగియడంతో, ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేసింది. సర్పంచుల నుంచి రికార్టులన్నీ స్వాధీనం చేసుకోవాలని సంబంధిత శాఖాధికారులు(Officers) ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు, విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.
కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు ధర్మాసనం
High Court Trial On Free Bus Travel : టీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫ్రీ బస్సు పథకం వల్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సులలో(TSRTC Bus) తీవ్ర రద్దీ పెరిగిందని, కుటుంబంతో కలిసి బయటకు వెళ్లినప్పుడు బస్సులో కనీసం నిలబడే స్థలం కూడా లేదని, ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదని సీజే జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్ కుటుంబంతో కలిసి వెళ్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్నే, పిటిషన్‌లో పేర్కొన్నారని హైకోర్టు తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్టీని ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ భార్యలు- అందరూ పెన్షన్‌కు అర్హులే: హైకోర్టు