ETV Bharat / state

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ - Governor Quota MLCs Issue

High Court Break to take oath of MLCs in Governor Quota : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీ వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలిపింది.

High Court JUDGEMENT
High Court Action on oath of MLCs in governor quota in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 2:47 PM IST

Updated : Jan 30, 2024, 10:24 PM IST

High Court Break to take oath of MLCs in Governor Quota : తెలంగాణలో గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ విషయంలో మరో మలుపు తిరిగింది. ఈ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని చేయవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు గవర్నర్​ కోటాలో ఎంపికైన కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలిపింది.

Governor Quota MLCs Issue in Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్​లను తమిళిసై సౌందర రాజన్ నియమించారు. వీరిద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్​(Governor MLCs Issue)కు సిఫారసు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. శనివారం నోటిఫికేషన్ కూడా వచ్చింది. 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గత ప్రభుత్వం గవర్నర్​కు సిఫారసు చేసింది. అయితే 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను ఆమె తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.

'దిల్లీలో సైతం మార్పు రావాలి - పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం'

Telangana High Court Judgement on Governor Quota MLCs : గవర్నర్ నిర్ణయాన్ని శ్రవణ్‌, సత్యనారాయణలు సవాల్​ చేస్తూ హైకోర్టులో ఫిటిషన్​ వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌(Prof Kodandaram), సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్‌లను ఎంపిక చేసింది. ఈ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు.

ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం ఈనెల 27న జీవో 12ను జారీ చేసింది. ఈ జీవో 12ను సవాలు చేస్తూ పిటిషనర్లు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు కొత్తగా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే(Justice Alok Aarade), జస్టిస్ జే అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎమ్మెల్సీలుగా మహేశ్‌కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌ ఎన్నిక ఏకగ్రీవం - ఈసీ ప్రకటన

Telangana High Court to Stop Governor Quota MLC Oathing: పిటిషన్ పెండింగ్‌లో ఉండగా గవర్నరు కోటా కింద నియామకం చేపడుతూ నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కోర్టులో పెండింగ్ ఉండగా ఎలా ముందుకెళ్లారని ప్రశ్నించగా అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ పిటిషన్లలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేవన్నారు. నియామక ప్రక్రియను చేపట్టడం ద్వారా నమ్మకంపై దెబ్బకొట్టారని పిటిషనర్ల తరపు న్యాయవాది అన్నారు.

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అందరి అభిప్రాయాల మేరకే విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశామని అలాంటప్పుడు పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఎలా ముందుకెళ్లారని ప్రశ్నించింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియను(MLCs Appointment Process) తాము నిలపడంలేదని, దానిపై కేవలం యథాతథస్థితి కొనసాగించాలని మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఇరువురి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది.

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్‌ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం

Last Updated : Jan 30, 2024, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.