ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం - పిడుగుపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల మృతి - Two People Died Due To ThunderStorm

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 4:20 PM IST

Two People Died Due To Thunder Storm : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పిడుగుపడి దమ్మపేట మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. జమిందారు బంజరుకు చెందిన బుర్ర చందు (11), సిద్దు (9) గ్రామం సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో వారిద్దరూ దుర్మరణం చెందారు.

Hevy Rains In Badrachalam
Two People Died Due To ThunderStorm (ETV Bharat)

Two People Died Due To Thunder Storm : రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పిడుగుపడి దమ్మపేట మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

జమిందారు బంజరుకు చెందిన బుర్ర చందు (11), సిద్దు (9) గ్రామం సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడటంతో వారిద్దరూ దుర్మరణం చెందారు. ఇద్దరు పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారిగా ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Hevy Rains In Badrachalam : భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా దమ్మపేట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దమ్మపేట-మందలపల్లి ప్రధాన రహదారి వరద నీటితో కాలువను తలపిస్తోంది. ములకలపల్లి మండలంలో రహదారులపై నీరు చేరి పలు చోట్ల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది. అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరటంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధానంగా అశ్వరావుపేట-భద్రాచలం రహదారిలో ఉట్లపల్లి సమీపంలో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి తెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనాలు ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.

అధికారులు అప్రమత్తం : మరోవైపు భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని ఇళ్లు ఖాళీ చేపించి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్​కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రాగల 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - heavy rain alert for telangana

కారు కారు ఎందుకు మా గల్లీలోకి కొట్టుకొచ్చావంటే? - వరద నీరు నన్ను మోసుకొచ్చిందని అందట - Krishna Nagar water Logging Problem

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.