ETV Bharat / state

లావణ్య మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది - పోలీసులకు రాజ్​తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు - Hero Raj Tarun Lavanya Case - HERO RAJ TARUN LAVANYA CASE

Hero Rajtarun Lavanya Case : సినీ నటుడు రాజ్​ తరుణ్ - లావణ్య వ్యవహారం ప్రస్తుతం హాట్​ టాఫిక్​గా మారిపోయింది. తాజాగా లావణ్యపై రాజ్​తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Hero Rajtarun Parents Filed Case Against Lavanya
Hero Rajtarun Lavanya Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 10:47 PM IST

Hero Rajtarun Parents Filed Case Against Lavanya : యువ హీరో రాజ్‌తరుణ్‌- లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారింది. గత పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

లావణ్యపై రాజ్​తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు : తాజాగా లావణ్యపై నటుడు రాజ్​తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని హీరో తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇద్దరికీ కూడా హెల్త్ సమస్యలు ఉన్నాయని, తమని లావణ్య ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, సినీ హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి కాకతీయ హిల్స్​లో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి లావణ్య అనే యువతి వారి ఇంటికి వెళ్లి గట్టిగా డోర్ కొట్టి అరిచిందని హీరో తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

'నా భర్తను నా వద్దకు చేర్చండి' - నార్సింగ్ పోలీసులకు సినీనటి లావణ్య విజ్ఞప్తి - Lavanya Statement on Raj Tarun Case

హైకోర్టును ఆశ్రయించిన రాజ్​తరుణ్ : మరోవైపు రాజ్‌ తరుణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదైంది.

రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన ‘తిరగబడరా సామీ’ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించగా అక్కడ రాజ్‌తరుణ్‌ను కలుసుకోవడానికి వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. తన భర్త రాజ్‌తరుణ్‌తో మాట్లాడాలంటూ లావణ్య పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇటీవల ‘పురుషోత్తముడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రాజ్‌ తరుణ్‌ ఈ శుక్రవారం ‘తిరగబడరసామీ’తో వస్తున్నారు.

లావణ్య చేసింది ఆరోపణలు మాత్రమే - నా దగ్గర ఆధారాలున్నాయి లీగల్​గా వెళ్తా : రాజ్​ తరుణ్​ - Hero Raj Tarun Reaction on lavanya

రాజ్​తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya Comments on rajtarun

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.