Help Desk the Non-Residents Of Telangana : అమెరికా సహా ఏ దేశంలో తెలంగాణ పౌరులు నివసిస్తున్నా వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు. ప్రవాస తెలంగాణ వాసులందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తుందని, వారి అవసరాలను తీరుస్తామని తెలిపారు. అమెరికాలోని షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ మజహిర్ అలీపై దాడిని సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
CM Revanth Reddy Tweet on Chicago Attack : హైదరాబాద్‌కు చెందిన అలీ అనే విద్యార్థిపై షికాగోలో ముగ్గురు దొంగలు దాడి చేసిన విషయం తెలిసి కలత చెందానని, ఇది ఓహైయోలో హత్యకు గురైన బి.శ్రేయస్ రెడ్డి ఘోరమైన దాడి ఉదంతాన్ని తలపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అమెరికా సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారి భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు సమస్యను అర్థం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను అభ్యర్థించారు.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
‘‘హైదరాబాద్‌కు చెందిన అలీ అనే విద్యార్థిపై షికాగోలో దొంగలు దాడి చేసిన విషయం తెలిసి కలత చెందాను. ఇది ఓహైయోలో హత్యకు గురైన బి.శ్రేయస్‌రెడ్డి ఘోరమైన దాడి ఉదంతాన్ని తలపిస్తోంది. తెలంగాణ పౌరులు అమెరికా సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారి భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మా ఆందోళనలను అర్థం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌ను అభ్యర్థిస్తున్నా’’ -సీఎం రేవంత్ రెడ్డి
న్యూయార్క్: షికాగోలో గత ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురైన భారతీయ ఐటీ విద్యార్థి సయ్యద్ మజహర్ అలీ కుటుంబం కేంద్ర మంత్రి జైశంకర్ సాయం కోరింది. దుండగులు మజహర్ ఇంటి సమీపంలో అతడిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో రక్తసిక్తమైన మజహర్ అలీ వీడియో వైరల్‌గా మారింది. బాధితుడు ఇండియానా వెజ్‌లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆరు నెలల కిందట అమెరికాకు వచ్చాడు.
స్థానిక ఆసుపత్రిలో ఇతను చికిత్స పొందుతున్నాడు. మజహర్ అలీ కుటుంబంతో తాము సంప్రదింపులు జరిపామని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ట్విట్టర్ ‘ఎక్స్’ ద్వారా పేర్కొంది. మరోవైపు తన భర్తపై జరిగిన దాడి నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికా వెళ్లేందుకు సహకరించాలని హైదరాబాద్లో ఉంటున్న మజహర్ అలీ భార్య రుఖియా ఫాతిమా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు.
ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలిచేనా!