ETV Bharat / state

తెలంగాణపై ఉపరితల ఆవర్తనం - పలు జిల్లాల్లో భారీవర్ష సూచన - Hyderabad Rain Updates - HYDERABAD RAIN UPDATES

Hyderabad Rain Updates : భాగ్యనగరంలో ఉదయం వరకు ఒక లెక్క, సాయంత్రమైతే మరో లెక్క అన్నట్టు భానుడు, వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. సాయంత్రం వేళ కురుస్తున్న భారీ వానలకు నగరవాసులు లబోదిబోమంటున్నారు. ఈక్రమంలోనే రాజధాని పరిధిలో పలు చోట్ల వర్షం కురిసింది. కాగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Telangana Monsoon Report Today
Hyderabad Rains Toady (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 4:42 PM IST

Hyderabad Rains Toady : హైదరాబాద్​ నగరంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. సాయంత్రమైతే చాలు నగరవాసులకు వాన చినుకు పలకరిస్తుంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో విలవిల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం కల్గిస్తున్నా, పలుచోట్ల కురుస్తున్న భారీ వానలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. భాగ్యనగరంలోని చాలా ప్రాంతాల్లో ఇవాళ వాన జల్లులు కురిసాయి. దీంతో రోడ్లపై వరదనీరు వచ్చి చేరింది. హైదరాబాద్​లోని జీడిమెట్ల, గాజులరామారం, సూరారం, పేట్ బషీరాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వాన కురవగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Telangana Monsoon Report Today : రాష్ట్రంలో ఈ రోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. గురువారం అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించారు. ద్రోణి ఒకటి మధ్య గుజరాత్ ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మీదుగా తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని తెలిపారు. ఆవర్తనం పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. మధ్య కొనసాగుతుందన్నారు.

భాగ్యనగరంలో దంచికొట్టిన వాన - తీవ్ర అవస్థలు పడ్డ వాహనదారులు - Heavy Rains in Hyderabad

వానొచ్చి పాయే గింజ మొలవదాయే - ఈయేడు వర్షం మూణ్నాళ్ల మురిపెమాయే - RAIN DEFICIT IN TELANGANA 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.