ETV Bharat / state

LIVE UPDATES : వరద బాధితులకు ఉచిత సేవలు - ముందుకొచ్చిన ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ - AP Rains Live Updates - AP RAINS LIVE UPDATES

AP Rains Live Updates
AP Rains Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 6:50 AM IST

Updated : Sep 9, 2024, 8:21 PM IST

Heavy Rains in Andhra Pradesh Today : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గెడ్డలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లంక గ్రామల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలని అధికారులు సూచించారు.

LIVE FEED

8:20 PM, 9 Sep 2024 (IST)

బుడమేరులో పూడ్చిన గండ్లు వద్ద గట్టును మరింత ఎత్తు పెంచుతున్నాం: నిమ్మల

  • బుడమేరులో పూడ్చిన గండ్లు వద్ద గట్టును మరింత ఎత్తు పెంచుతున్నాం: నిమ్మల
  • సీపేజ్‌ను నియంత్రించేలా మెటల్, జియో టెక్స్‌టైల్ టెక్నాలజీ వాడుతున్నాం: నిమ్మల
  • రెండు గండ్ల మధ్య నల్ల రేగడి మట్టితో గట్టు బలోపేతం చేస్తున్నాం: నిమ్మల
  • భవిష్యత్తులో వరద పెరిగినా.. పట్టిసీమ నీరు తరలించేలా ఏర్పాట్లు: నిమ్మల

8:19 PM, 9 Sep 2024 (IST)

విద్యుత్ పునరుద్ధరణ కాని వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

  • విద్యుత్ పునరుద్ధరణ కాని వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటన
  • వరద ప్రాంతాల్లో గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన
  • జక్కంపూడి, కబేళా సెంటర్, సితార్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటన
  • విద్యుత్ పునరుద్ధరణ సవాళ్లను ప్రజలకు వివరించిన గొట్టిపాటి
  • సబ్‌స్టేషన్లు నీటిలో మునిగి పాడైన పరిస్థితి వివరించిన మంత్రి
  • వరద ప్రాంతాల్లో 95శాతం విద్యుత్ పునరుద్ధరణ చేశాం: గొట్టిపాటి రవి
  • లంక గ్రామాల్లో పూర్తిగా విద్యుత్‌ పునరుద్ధరించాం: మంత్రి గొట్టిపాటి రవి
  • విజయవాడ పరిసరాల్లో మరో 5శాతం విద్యుత్ పునరుద్ధరించాల్సి ఉంది: గొట్టిపాటి
  • రేపటి వరకు విద్యుత్‌ సమస్య పరిష్కారం అవుతుంది: గొట్టిపాటి రవి
  • మంచినీటి ట్యాంక్‌ల సంఖ్య పెంచి అందరికీ అందేలా చేస్తాం: గొట్టిపాటి రవి

7:10 PM, 9 Sep 2024 (IST)

ఏలేరు వరద ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌ పర్యటన

  • కాకినాడ: ఏలేరు వరద ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌ పర్యటన
  • కాకినాడ: గొల్లప్రోలు మండలంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌
  • ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడా: పవన్‌
  • ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: పవన్‌
  • సుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: పవన్‌
  • ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు ఇస్తున్నాం: పవన్‌ కల్యాణ్‌
  • బుడమేరులో ఆక్రమణలకు పాల్పడిన వారితో మాట్లాడాలి: పవన్‌
  • ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు: పవన్‌
  • అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది: పవన్‌ కల్యాణ్‌
  • నదులు, వాగుల ప్రాంతాల్లోని కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి: పవన్‌

7:10 PM, 9 Sep 2024 (IST)

వరద బాధితులకు విరాళం అందించిన సింగపూర్‌ ప్రవాస తెలుగువారు

  • వరద బాధితులకు విరాళం అందించిన సింగపూర్‌ ప్రవాస తెలుగువారు
  • సీఎం సహాయనిధికి రూ.17.5 లక్షలు ఇచ్చిన సింగపూర్‌లోని తెలుగువారు

6:15 PM, 9 Sep 2024 (IST)

ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఎల్‌జీ

  • వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఎల్‌జీ
  • సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ
  • ఎల్జీ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచిత సర్వీస్, స్పేర్ పార్టులపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తాం: ఎల్‌జీ

5:32 PM, 9 Sep 2024 (IST)

ఏవోబీలో నిలిచిన విద్యుదుత్పత్తి

  • అల్లూరి జిల్లా: ఏవోబీలోని మాచ్‌ఖండ్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
  • మాచ్‌ఖండ్‌ విద్యుత్ కేంద్రంలోకి వరదనీరు రావడంతో ఉత్పత్తి నిలిపివేత
  • మాచ్‌ఖండ్‌కు జోలాపుట్‌ నుంచి వస్తున్న 45 వేల క్యూసెక్కుల నీరు
  • మాచ్‌ఖండ్‌కు డుడుమా నుంచి వస్తున్న 33 వేల క్యూసెక్కుల నీరు

5:31 PM, 9 Sep 2024 (IST)

పందెం వేసుకుని మున్నేరులో దూకిన ఇద్దరు యువకులు

  • ఎన్టీఆర్ జిల్లా: నందిగామ వద్ద మున్నేరులో దూకిన ఇద్దరు యువకులు
  • మున్నేరులో చంటి అనే వ్యక్తి గల్లంతు, మరో వ్యక్తి క్షేమం
  • పందెం వేసుకుని మున్నేరులో దూకినట్లు తెలిపిన పోలీసులు

5:31 PM, 9 Sep 2024 (IST)

వరద బాధిత గ్రామాల సర్పంచులతో మంత్రి మనోహర్ భేటీ

  • గుంటూరు: వరద బాధిత గ్రామాల సర్పంచులతో మంత్రి మనోహర్ భేటీ
  • పవన్ కల్యాణ్‌ ఇస్తున్న రూ.లక్ష చెక్కులు పంపిణీ చేసిన మనోహర్‌
  • బాపట్ల, గుంటూరు జిల్లాల సర్పంచులకు తెనాలిలో చెక్కుల పంపిణీ
  • కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు

5:31 PM, 9 Sep 2024 (IST)

వరద బాధితులకు రూ.2.5 కోట్లు విరాళం ఇచ్చిన జీఎంఆర్‌

  • వరద బాధితులకు రూ.2.5 కోట్లు విరాళం ఇచ్చిన జీఎంఆర్‌
  • సీఎంను కలిసి విరాళం అందించిన జీఎంఆర్‌ డైరెక్టర్ చల్లా ప్రసన్న
  • వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చిన ఏఐజీ ఆస్పత్రి
  • సీఎంను కలిసి విరాళం అందించిన ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్‌ డి.నాగేశ్వరరెడ్డి

5:11 PM, 9 Sep 2024 (IST)

బుడమేరు వరదను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్

  • బుడమేరు వరదను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్
  • మంత్రి నిమ్మలతో మాట్లాడి పనులు సమన్వయం చేసుకుంటున్న లోకేశ్
  • జియోమెంబ్రేన్ షీట్ల వినియోగం ద్వారా లీకేజ్‌లకు అడ్డుకట్ట
  • బుడమేరుకు గండ్లు పడినచోట మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచిన అధికారులు

4:36 PM, 9 Sep 2024 (IST)

రాత్రి 7.30 వరకు కొనసాగనున్న తీవ్రవాయుగుండం ప్రభావం

  • తీవ్ర వాయుగుండం పూరీ వద్ద తీరం దాటిందని ప్రకటించిన ఐఎండీ
  • ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోంది: ఐఎండీ
  • రాత్రి 7.30 వరకు కొనసాగనున్న తీవ్రవాయుగుండం ప్రభావం
  • ఛత్తీస్‌గఢ్‌ దిశగా వెళ్లి బలహీనపడి వాయుగుండంగా మారుతుంది: ఐఎండీ

4:21 PM, 9 Sep 2024 (IST)

అనకాపల్లి శివారుకు భారీగా చేరుతున్న వరదనీరు

  • అనకాపల్లి: బొజ్జన్నకొండ వద్ద పొంగి ప్రవహిస్తున్న ఏలేరు కాలువ
  • అనకాపల్లి శివారుకు భారీగా చేరుతున్న వరదనీరు
  • బొజ్జన్నకొండ వద్ద పంటలను ముంచిన పులికాట్‌ వాగు

3:59 PM, 9 Sep 2024 (IST)

వరదముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన

  • విజయవాడ: వరదముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన
  • భవానీపురం, స్వాతి థియేటర్, ఊర్మిళానగర్‌లో సీఎం పర్యటన
  • బాధితులను పరామర్శించి, వారి కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం
  • వరద తీవ్రత వల్ల అందరికీ పూర్తిగా సాయం చేయలేకపోయాం: సీఎం
  • వరదల్లో నష్టపోయిన అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో నష్టం అంచనా ప్రారంభించాం: సీఎం చంద్రబాబు

3:23 PM, 9 Sep 2024 (IST)

జలాశయాల్లో ప్రమాదకరంగా నీటిమట్టం

  • అనకాపల్లి: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వాగుల ఉద్ధృతి
  • అనకాపల్లి: కోనాం, పెద్దేరు జలాశయాల్లో ప్రమాదకరంగా నీటిమట్టం
  • అనకాపల్లి: శారదా, బొడ్డేరు, పెద్దేరు నదుల్లో వరద ఉద్ధృతి

3:10 PM, 9 Sep 2024 (IST)

విరిగిపడిన కొండచరియలు

  • అల్లూరి జిల్లా: చట్రాయిపల్లి వద్ద విరిగిపడిన కొండచరియలు
  • కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
  • అల్లూరి జిల్లా: గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
  • అల్లూరి జిల్లా: మరో నలుగురిని కాపాడిన స్థానికులు

2:54 PM, 9 Sep 2024 (IST)

ఉద్ధృతిగా ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ

  • అనకాపల్లి జిల్లా: ఉద్ధృతిగా ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ
  • బొజ్జనకొండ సమీపంలో బలహీనంగా ఉన్న ఏలేరు కాల్వ గట్టు
  • అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంటపొలాలు

2:42 PM, 9 Sep 2024 (IST)

మరో 3 గంటల్లో తీరం దాటే అవకాశం

  • వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
  • పూరీకి తూర్పు-ఆగ్నేయ దిశలో 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • పారాదీప్‌నకు (ఒడిశా) నైరుతి దిశలో 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • కళింగపట్నానికి 260 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • పూరీ వద్ద మరో 3 గంటల్లో తీరం దాటే అవకాశం
  • రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

2:22 PM, 9 Sep 2024 (IST)

తాండవ జలాశయానికి పెరుగుతున్న వరద

  • అనకాపల్లి జిల్లా తాండవ జలాశయానికి పెరుగుతున్న వరద
  • తాండవ జలాశయానికి చేరుతున్న 7,600 క్యూసెక్కులు
  • తాండవ జలాశయం 2 గేట్లు ఎత్తి 7,593 క్యూసెక్కులు విడుదల
  • తాండవ నది పరివాహక లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత
  • వరద పరిస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిత

2:22 PM, 9 Sep 2024 (IST)

వర్షాలు, వరదలుపై కాకినాడ కలెక్టరేట్‌లో పవన్‌ కల్యాణ్ సమీక్ష

  • రాజమహేంద్రవరం విమానాశ్రాయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్
  • రోడ్డు మార్గంలో కాకినాడ బయలుదేరిన పవన్ కల్యాణ్
  • వర్షాలు, వరదలుపై కాకినాడ కలెక్టరేట్‌లో పవన్‌ కల్యాణ్ సమీక్ష

2:13 PM, 9 Sep 2024 (IST)

ఏలూరు కాలువ మీద ఉన్న కాజ్‌వే ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డు

  • అనకాపల్లి జిల్లా కొప్పాక వద్ద జాతీయరహదారిపై వాహనాల దారి మళ్లింపు
  • జాతీయరహదారిపై ఒకవైపు నుంచి వాహన రాకపోకలు
  • ఉద్ధృతంగా మారిన ఏలూరు కాలువ నీటి ప్రవాహం
  • ఏలూరు కాలువ మీద ఉన్న కాజ్‌వే ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డు
  • రోడ్డు దెబ్బతినడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

2:13 PM, 9 Sep 2024 (IST)

రాజుపాలెం వద్ద ఏలేరు కాల్వకు గండి

  • కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాల్వకు గండి

2:12 PM, 9 Sep 2024 (IST)

వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీని పరిశీలించిన మంత్రి అచ్చెన్న

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీని పరిశీలించిన మంత్రి అచ్చెన్న
  • ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువుల పంపిణీ పారదర్శకంగా జరగాలని ఆదేశాలు
  • వస్తువులు అందుతున్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్న మంత్రి అచ్చెన్న

2:12 PM, 9 Sep 2024 (IST)

ఆర్టీసీకి సుమారు రూ.30 కోట్లు నష్టం వాటిల్లింది: మంత్రి మండిపల్లి

  • ఆర్టీసీకి సుమారు రూ.30 కోట్లు నష్టం వాటిల్లింది: మంత్రి మండిపల్లి
  • విజయవాడలో ఆర్టీసీ తరఫున సుమారు 25 బస్సుల్లో ఉచిత ప్రయాణం: మంత్రి
  • వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం 250 బస్సులు: మంత్రి

2:12 PM, 9 Sep 2024 (IST)

విజయవాడలో ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

  • విజయవాడ విద్యాధరపురంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన
  • నీటమునిగిన విద్యాధరపురం ఆర్టీసీ డిపో, బస్సుల పరిస్థితిని పరిశీలించిన మంత్రి
  • విజయవాడలో ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
  • ఇప్పటికీ డ్రైనేజీ నీటిలోనే ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్ లోపలికి వెళ్లిన మంత్రి
  • వరదలతో ఆర్టీసీకి జరిగిన మొత్తం నష్టం మంత్రికి వివరించిన ఆర్టీసీ ఈడీలు

2:11 PM, 9 Sep 2024 (IST)

వరద బాధితుల సహాయార్థం లలితా జ్యువెలర్స్ రూ.కోటి విరాళం

  • వరద బాధితుల సహాయార్థం లలితా జ్యువెలర్స్ రూ.కోటి విరాళం
  • సీఎంను కలిసి చెక్కు అందించిన లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్‌కుమార్
  • సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారు: కిరణ్‌కుమార్‌
  • ప్రతిఒక్కరూ సాయం చేయాలి: లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్‌కుమార్

12:45 PM, 9 Sep 2024 (IST)

ఏలేరు జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న వరద పోటు

  • ఏలేరు జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న వరద పోటు
  • 5 గేట్ల ద్వారా 18,500 క్యూసెక్కులు దిగువకు విడుదల
  • పోటెత్తుతున్న సందర్శకులు, అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

12:45 PM, 9 Sep 2024 (IST)

బుడమేరుకు వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో లోకేశ్ సమీక్ష

  • బుడమేరుకు వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో లోకేశ్ సమీక్ష
  • మంత్రి నిమ్మల సమన్వయంతో పనులు వేగవంతమయ్యేలా లోకేశ్ చర్యలు
  • యుద్ధప్రాతిపదికన చర్యలతో గండ్లు పడినచోట తగ్గిన సీపేజ్ లీకేజ్
  • పూర్తిస్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్‌ ఆదేశం
  • నష్ట అంచనా పర్యవేక్షణకు 36 మంది ప్రజాప్రతినిధుల నియామకం
  • బాధితులకు సహాయం చేస్తూనే మరోవైపు నష్టం అంచనా పూర్తికి చర్యలు

12:20 PM, 9 Sep 2024 (IST)

ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది: మంత్రి పార్థసారథి

  • వరద నష్టం అంచనాకు మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాలు: మంత్రి పార్థసారథి
  • నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌: మంత్రి పార్థసారథి
  • త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు: మంత్రి పార్థసారథి
  • ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు: మంత్రి పార్థసారథి
  • ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది: మంత్రి పార్థసారథి
  • ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం: మంత్రి పార్థసారథి

12:20 PM, 9 Sep 2024 (IST)

ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తతపై అధికారులకు సీఎం సూచన

  • ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తతపై అధికారులకు సీఎం సూచన
  • భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం
  • బుడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గినందున కొంత ఉపశమనం: సీఎం
  • సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడొచ్చు: సీఎం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
  • ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపైనా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • కాకినాడ, ఏలూరు, తూ.గో. కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్‌ను ఉపయోగించండి: సీఎం
  • కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలి: సీఎం
  • విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందన్న అధికారులు
  • అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశం
  • వైద్య శిబిరాలు కొనసాగించాలని అధికారులకు సూచించిన సీఎం
  • ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున డ్రోన్ ద్వారా చర్యలకు ఆదేశం
  • ఏలేరు రిజర్వాయర్‌లోకి వచ్చే నీరు, పంపే నీటిని బ్యాలెన్స్‌ చేసుకోవాలి: సీఎం
  • ముందస్తు చర్యల వల్ల ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించవచ్చు: సీఎం
  • ఏలేరు రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో తక్షణమే మరమ్మతులకు సీఎం ఆదేశం
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించిన కలెక్టర్లు

11:54 AM, 9 Sep 2024 (IST)

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం

  • ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
  • కైకలూరు మండలం కొల్లేరు పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కామినేని
  • పందిరిపల్లిగూడెంలో కొల్లేరు సరస్సులో పక్కకు ఒరిగిన కామినేని వాహనం
  • కామినేనిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో తప్పిన ప్రమాదం
  • ఆలపాడు-కొల్లేటికోట రహదారి పూర్తిగా నీటమునగడంతో పర్యటనకు వెళ్లిన కామినేని

11:24 AM, 9 Sep 2024 (IST)

ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరం

  • ఇంజిన్లు, మోటార్లతో నీటిని తోడుతున్న సిబ్బంది
  • ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరం
  • వరద తగ్గినచోట రోడ్లపై చెత్తను తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
  • వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సిబ్బంది

10:40 AM, 9 Sep 2024 (IST)

నేడు దెబ్బతిన్న పంచాయతీలకు విరాళం అందించనున్న పవన్

  • నేడు దెబ్బతిన్న పంచాయతీలకు విరాళం అందించనున్న పవన్
  • 5 జిల్లాల్లోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముంపు బారినపడిన 400 పంచాయతీలు
  • తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో దెబ్బతిన్న పంచాయతీలు
  • ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం
  • కూటమి నాయకుల చేతుల మీదుగా 21 కేంద్రాల్లో సర్పంచులకు చెక్కులు పంపిణీ
  • విరాళం అందించేందుకు 20 కేంద్రాలు ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులు
  • సర్పంచులకు నగదు అందించే కార్యక్రమాల్లో కూటమి నేతలు పాల్గొనాలని సూచన
  • తెనాలిలో చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి నాదెండ్ల
  • నేరుగా పంచాయతీలకు విరాళం ఇస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

10:22 AM, 9 Sep 2024 (IST)

చట్రాయిపల్లి వద్ద విరిగిపడిన కొండచరియలు - ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు

  • అల్లూరి జిల్లా జి.కె.వీధి మం. చట్రాయిపల్లి వద్ద విరిగిపడిన కొండచరియలు
  • కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు
  • మరో నలుగురిని కాపాడిన స్థానికులు
  • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

10:22 AM, 9 Sep 2024 (IST)

నిండుకుండలా మారిన ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్‌

  • కాకినాడ జిల్లాలో నిండుకుండలా మారిన ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్‌
  • ఎగువ ప్రాంతాల్లోని నీరు జలాశయాలకు చేరి ఉద్ధృతంగా ప్రవాహం
  • ప్రత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి సాగర్ నుంచి నీటి విడుదల
  • వేములపాలెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏటి కాల్వ
  • వంతెనలపై నీటి ప్రవాహంతో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు

9:59 AM, 9 Sep 2024 (IST)

బుడమేరు ప్రవాహ ప్రాంతాలకు అప్రమత్తత: విజయవాడ నగరపాలక సంస్థ

  • బుడమేరు ప్రవాహ ప్రాంతాలకు అప్రమత్తత: విజయవాడ నగరపాలక సంస్థ
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలి: కమిషనర్‌ ధ్యానచంద్ర
  • బుడమేరుకు ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం: కమిషనర్‌ ధ్యానచంద్ర

9:59 AM, 9 Sep 2024 (IST)

పెద్దాపురం వద్ద ఏలేరు కాల్వకు వరద ఉద్ధృతి

  • కాకినాడ జిల్లా పెద్దాపురం వద్ద ఏలేరు కాల్వకు వరద ఉద్ధృతి
  • కాండ్రకోట వద్ద ఇసుక బస్తాలు సిద్ధం చేసిన రెవెన్యూ సిబ్బంది

9:58 AM, 9 Sep 2024 (IST)

కొల్లేరులో రోజురోజుకు పెరుగుతున్న వరద

  • ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు రోజురోజుకు పెరుగుతున్న వరద
  • ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై 4 అడుగులకు చేరిన నీటి ప్రవాహం
  • కైకలూరు, మండవల్లి మండలాల్లో ముంపు బారిన పడిన 30 గ్రామాలు
  • మండవల్లి మం. కొవ్వాడ లంక దెయ్యంపాడు ప్రధాన రహదారులు జలమయం
  • చిన్నఎడ్లగాడి వద్ద కొనసాగుతున్న పోలీస్ పికెట్
  • కైకలూరు, మండవల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో రాకపోకలు నిషేధం

9:57 AM, 9 Sep 2024 (IST)

చట్రాయిపల్లి వద్ద విరిగిపడిన కొండచరియలు

  • కొండచరియలు కింద నలుగురు ఉన్నట్లు స్థానిక గిరిజనుల్లో ఆందోళన
  • సీలేరు ఎస్సై ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనాస్థలికి బయల్దేరిన బృందం

9:57 AM, 9 Sep 2024 (IST)

అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు

  • అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
  • ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో ఘటన
  • నర్సీపట్నం-భద్రాచలం అంతర్రాష్ట్ర రహదారిపై విరిగిపడిన కొండచరియలు
  • సీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల విరిగిపడిన కొండచరియలు
  • భారీగా పేరుకుపోయిన బురద, నిలిచిపోయిన రాకపోకలు
  • దాదాపు 16 కి.మీ. మేర పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు

9:37 AM, 9 Sep 2024 (IST)

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం
  • వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • వాయవ్య దిశగా ఈ మధ్యాహ్నానికి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం
  • ఉత్తర, వాయవ్య దిశగా గంటకు 6 కి.మీ. వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం
  • పూరీకి 70 కి.మీ., గోపాలపూర్‌కు 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • కళింగపట్నం(శ్రీకాకుళం)కు 240 కి.మీ., దిఘా(బంగాల్)కు 290 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
  • మరో 3 రోజుల వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్ష సూచనలు
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు
  • అత్యధికంగా పూసపాటిరేగలో 14 సెం.మీ. వర్షపాతం నమోదు

9:37 AM, 9 Sep 2024 (IST)

వ్యవసాయ, ఉద్యాన ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష

  • వ్యవసాయ, ఉద్యాన ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష
  • మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్న అత్యవసర సమీక్ష
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, విజయవాడ వరద సహాయచర్యలపై టెలీకాన్ఫరెన్స్
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
  • నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశం

9:16 AM, 9 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

  • ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,93,952 క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 202 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజీ వద్ద 11.9 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

9:15 AM, 9 Sep 2024 (IST)

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
  • వాగులు, నదులు, జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • ముందస్తుచర్యల్లో భాగంగా తాటిపూడి, మడ్డువలస నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
  • విజయనగరం: తాటిపూడి ప్రాజెక్టు నుంచి 350 క్యూసెక్కులు విడుదల
  • మడ్డువలస నుంచి 8 గేట్ల ద్వారా 17 వేల క్యూసెక్కులు నీటి విడుదల
  • మన్యం జిల్లా పాచిపెంట మం. పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి 300 క్యూసెక్కులు విడుదల

9:13 AM, 9 Sep 2024 (IST)

రణస్థలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఎంపీ కలిశెట్టి

  • శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఎంపీ కలిశెట్టి
  • ఏ అవసరమొచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటారన్న ఎంపీ కలిశెట్టి
  • 89190 60911, 86393 20927 నెంబర్లలో సంప్రదించాలని సూచన
  • అర్ధరాత్రి వరకు కంట్రోల్‌ రూమ్‌లోనే ఉండి పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలిశెట్టి
  • లావేరు మం. గెడ్డగొర్లెపేటలో పర్యటించి అక్కడి పరిస్థితిపై ఆరా తీసిన ఎంపీ కలిశెట్టి
  • పెద్ద గెడ్డ ఉద్ధృతికి గెడ్డగొర్లెపేటకు నిలిచిపోయిన రాకపోకలు
  • పెద్ద గెడ్డ వెళ్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానన్న ఎంపీ కలిశెట్టి

9:03 AM, 9 Sep 2024 (IST)

పునరావాస కేంద్రాలకు కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు

  • విశాఖలోని పునరావాస కేంద్రాలకు కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు
  • అందరూ పునరావాస కేంద్రాలకు రావాలి: జీవీఎంసీ అదనపు కమిషనర్
  • మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో నీరు అధికంగా చేరింది: జీవీఎంసీ అదనపు కమిషనర్
  • గేట్లు ఎత్తడం వల్ల నీరు కాలనీల వద్ద ప్రవహించే అవకాశం: కమిషనర్‌
  • తాటిపూడి రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత, కాసేపట్లో భీమిలికి వరద: కమిషనర్‌
  • భీమిలి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలి: కమిషనర్‌

9:02 AM, 9 Sep 2024 (IST)

అనకాపల్లి జిల్లాలోని జలాశయాల్లో గరిష్ఠ స్థాయికి చేరిన నీటిమట్టాలు

  • అనకాపల్లి జిల్లాలోని జలాశయాల్లో గరిష్ఠ స్థాయికి చేరిన నీటిమట్టాలు
  • పాయకరావుపేటకు ఆనుకుని ప్రవహిస్తున్న తాండవ నది
  • లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
తాండవ నది వరద ప్రవాహం (ETV Bharat)
AP Rains
తాండవ నది వరద ప్రవాహం (ETV Bharat)

9:01 AM, 9 Sep 2024 (IST)

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం

  • శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం
  • నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులకు వరద ఉద్ధృతి
  • శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • రణస్థలంలోని ఎంపీ కార్యాలయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి కంట్రోల్‌ రూమ్‌

9:01 AM, 9 Sep 2024 (IST)

మారేడుమిల్లి మండలంలో ప్రమాదకరంగా కొండ వాగులు

  • అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ప్రమాదకరంగా కొండ వాగులు
  • మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద తాగునీటి పథకాన్ని ముంచెత్తిన వాగు

8:37 AM, 9 Sep 2024 (IST)

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు

  • అల్లూరి జిల్లాలోని సీలేరు జలాశయానికి పోటెత్తిన వరద
  • ఎడతెరిపి లేని వర్షాలకు సీలేరుకు భారీగా వరద
  • సీలేరు జలాశయం 4 గేట్లు ఎత్తి 13 వేల క్యూసెక్కులు విడుదల
  • భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పిల్లిగెడ్డ అంతర్రాష్ట్ర వంతెన
  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు

8:37 AM, 9 Sep 2024 (IST)

నర్సీపట్నం-చింతపల్లి మధ్య మడిగుంట వద్ద కొట్టుకుపోయిన వంతెన

  • అల్లూరి జిల్లా నర్సీపట్నం-చింతపల్లి మధ్య మడిగుంట వద్ద కొట్టుకుపోయిన వంతెన

7:50 AM, 9 Sep 2024 (IST)

కాకినాడ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

  • కాకినాడ జిల్లాలో విస్తారంగా వర్షాలు
  • కోటనందూరు మండలంలో అత్యధికంగా 9.6 సెం.మీ. వర్షపాతం
  • నిండుకుండలా మారిన ఏలేరు జలాశయం
  • ఏలేరు జలాశయం పూర్తి నీటినిల్వ 24.11 అడుగులు
  • ఏలేరు జలాశయం ప్రస్తుత నీటినిల్వ 21.65 టీఎంసీలు
  • ఏలేరు నుంచి దిగువకు 9,500 క్యూసెక్కులు విడుదల
  • ఎగువ నుంచి ఏలేరు జలాశయానికి 21 వేల క్యూసెక్కులు
  • కిర్లంపూడి, పిఠాపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు అప్రమత్తత
  • ఉప్పాడ కొత్తపల్లి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • కాకినాడ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
  • క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

7:49 AM, 9 Sep 2024 (IST)

విజయవాడలో వరద ప్రభావం తగ్గడంతో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

  • విజయవాడలో వరద ప్రభావం తగ్గడంతో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
  • పలు మున్సిపాలిటీల నుంచి విజయవాడకు చేరుకున్న పారిశుద్ధ్య కార్మికులు
  • గత 5 రోజులుగా ముంపు ప్రాంతాల్లో కార్మికుల పారిశుద్ధ్య పనులు
  • కాల్వల్లో పూడికతీత, రోడ్లపై చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు
  • వీఎంసీ పరిధిలోని ముంపునకు గురైన 32 డివిజన్లలో పారిశుద్ధ్య పనులు
  • విజయవాడ: పారిశుద్ధ్య పనుల్లో సుమారు 7 వేల మంది కార్మికులు

7:49 AM, 9 Sep 2024 (IST)

అల్లూరి జిల్లాలో వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాల్వ ఉద్ధృతి

  • అల్లూరి జిల్లాలో వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాల్వ ఉద్ధృతి
  • రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ ఉద్ధృతి
  • వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాల్వ ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

7:48 AM, 9 Sep 2024 (IST)

ప్రమాదస్థాయిలో జోలాపుట్‌ జలాశయం

  • ప్రమాదస్థాయిలో జోలాపుట్‌ జలాశయం
  • ఏవోబీ నిర్వహణలోని మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రాలకు నీరందించే జోలాపుట్‌
  • జోలాపుట్‌ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కులు విడుదల
  • డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు విడుదల
  • వరద ఉద్ధృతి కారణంగా విద్యుత్ కేంద్రంలోకి నీరు ప్రవేశించే ప్రమాదం

7:27 AM, 9 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,17,270 క్యూసెక్కులు

  • ప్రకాశం బ్యారేజీ వద్ద 12.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం

7:27 AM, 9 Sep 2024 (IST)

అర్ధరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ

  • అర్ధరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ
  • ఓల్డ్ ఆర్.ఆర్.పేటలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
  • వరద తగ్గిన ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
  • బయట ప్రాంతాల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకున్న పలువురితో మాట్లాడిన నారాయణ
  • ప్రభుత్వం అందిస్తున్న సాయం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరద బాధితులు
  • డ్రైన్‌లలో పూడికతీత, చెత్త తరలింపు వేగంగా జరుగుతోంది: మంత్రి నారాయణ
  • రోడ్లతో పాటు ఇళ్లలో కూడా ఫైరింజన్లతో శుభ్రం చేస్తున్నాం: మంత్రి నారాయణ
  • వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నాం: మంత్రి నారాయణ
  • త్వరలోనే బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు: మంత్రి నారాయణ

7:26 AM, 9 Sep 2024 (IST)

తాండవ జలాశయం రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీరు విడుదల

  • అనకాపల్లి జిల్లాలో ప్రమాదకర స్థాయికి చేరిన తాండవ జలాశయం
  • తాండవ జలాశయం రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీరు విడుదల
  • తాండవ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు
  • తాండవ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులు
  • రహదారిపై పొంగి ప్రవహిస్తున్న తాండవ జలాశయం
  • తాండవ జలాశయం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • ఉప్పరగూడెం - గన్నవరంమెట్ట గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
AP Rains
ఉప్పరగూడెం - గన్నవరంమెట్ట గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు (ETV Bharat)

7:26 AM, 9 Sep 2024 (IST)

ప్రమాదకర స్థాయికి చేరిన కల్యానపులోవ జలాశయం

  • అనకాపల్లి జిల్లాలో ప్రమాదకర స్థాయికి చేరిన కల్యానపులోవ జలాశయం
  • 4 గేట్లు ఎత్తి నీటిని విడుదలు చేస్తున్న అధికారులు

7:25 AM, 9 Sep 2024 (IST)

నర్సీపట్నం-తుని మధ్య వాహన రాకపోకలను నిలిపివేసిన పోలీసులు

  • నర్సీపట్నం-తుని మధ్య వాహన రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
  • భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తలో భాగంగా రాకపోకలు నిలిపివేత
  • నర్సీపట్నం-తుని మధ్య పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
AP Rains
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు (ETV Bharat)

6:44 AM, 9 Sep 2024 (IST)

రహదారిపై పొంగి ప్రవహిస్తున్న తాండవ నది

  • అనకాపల్లి జిల్లాలో రహదారిపై పొంగి ప్రవహిస్తున్న తాండవ నది

శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కులు విడుదల

  • శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలం జలాశయానికి 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు
  • శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 205.22 టీఎంసీలు
  • విద్యుత్ ఉత్పత్తి చేసి 67,116 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల

6:43 AM, 9 Sep 2024 (IST)

నేడు కాకినాడ వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

  • నేడు కాకినాడ వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్
  • కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్న పవన్‌
  • ఏలేరు పరిధిలోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న పవన్‌

6:43 AM, 9 Sep 2024 (IST)

నేడు, రేపు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

  • నేడు, రేపు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంకు భారీవర్ష సూచన
  • విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • విజయనగరం, విశాఖ, తూ.గో., ప.గో., జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ సూచన
  • తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
  • తీరం వెంబడి గరిష్ఠంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
  • కళింగపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

6:43 AM, 9 Sep 2024 (IST)

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సూచనలు

  • ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సూచనలు
  • విశాఖ మున్సిపల్ కమిషనర్‌, అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

6:42 AM, 9 Sep 2024 (IST)

సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

  • విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
  • పోలీసు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు
  • విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590102, 0891-2590100
  • విశాఖ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ 0891-2565454, డయల్‌ 100, 112
  • పెదగంట్యాడ తహసీల్దార్ 9948821997, గాజువాక 8886471113
  • ఆనందపురం 9700501860, భీమిలి 9703888838, పద్మనాభం 7569340226
  • చినగదిలి 9703124082, పెందుర్తి 7702577311, సీతమ్మధార 9182807140
  • గోపాలపట్నం తహసీల్దార్‌ 7842717183, ములగాడ 9440552007
  • ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా సంప్రదించాలి: అధికారులు

6:42 AM, 9 Sep 2024 (IST)

అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

  • అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
  • అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
  • అనకాపల్లి కలెక్టరేట్‌ కంట్రోల్ రూమ్ నెంబర్లు 08924-226599, 08924-222888
  • అనకాపల్లి కంట్రోల్‌రూమ్ 9491998293, నర్సీపట్నం కంట్రోల్‌రూమ్ 7075356563

6:41 AM, 9 Sep 2024 (IST)

అల్లూరి జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ఘాట్‌రోడ్లు మూసివేత

  • అల్లూరి జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ఘాట్‌రోడ్లు మూసివేత
  • భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడతాయని రోడ్డు మూసివేత
  • అల్లూరి జిల్లా ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం: కలెక్టర్ దినేశ్‌కుమార్
  • అల్లూరి జిల్లా: లంబసింగి ఘాట్ రోడ్డును మూసివేసిన అధికారులు
  • భారీవర్షాల వల్ల చింతూరు ఘాట్ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిషేధం
  • నర్సీపట్నం-సీలేరు, వడ్డాది-పాడేరు ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం
  • అరకు-అనంతగిరి, రంపచోడవరం-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డుపై వాహనాలు నిషేధం
AP Rains
వరద నీటిలో నానుతున్న పంటపొలాలు (ETV Bharat)

6:41 AM, 9 Sep 2024 (IST)

భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ఎంపీ కలిశెట్టి

  • భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ఎంపీ కలిశెట్టి
  • తన కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసిన ఎంపీ కలిశెట్టి
  • విజయనగరం ఎంపీ క్యాంపు కార్యాలయ నెంబర్లు 8919060911, 8639320927
  • విజయనగరం ఎంపీ క్యాంపు కార్యాలయ నెంబర్లు 7027554609, 7989638689
  • జిల్లాలోని వర్షాలు, వరద బాధితులు ఫోన్ చేయవచ్చన్న ఎంపీ కలిశెట్టి

6:37 AM, 9 Sep 2024 (IST)

భారీ వర్షాల దృష్ట్యా నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు

  • భారీ వర్షాల దృష్ట్యా నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు
  • భారీ వర్షాల దృష్ట్యా విశాఖలోని ఏయూ వర్సిటీకి నేడు సెలవు
  • ఇవాళ జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేసిన రిజిస్ట్రార్
  • త్వరలో పరీక్షల తేదీని ప్రకటిస్తాం: రిజిస్ట్రార్ ధనుంజయ్ రావు
  • భారీ వర్షాల దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు
  • భారీ వర్షాల దృష్ట్యా అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు
  • భారీ వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

Last Updated : Sep 9, 2024, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.