ETV Bharat / state

అల్పపీడనం ఎఫెక్ట్​తో భారీ వర్షాలు - విద్యార్థులకు సెలవులు పొడిగింపు!

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు- ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు - ఎడతెరిపిలేని వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం - ఎక్కడికక్కడ కంట్రోల్​ రూమ్​ల ఏర్పాటు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

SCHOOL HOLIDAY IN AP TODAY
Holiday for Schools due To Rain in AP (ETV Bharat)

Holiday for Schools due To Rain in AP : దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. దీంతో కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో సైతం భారీ వర్షం పడతూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఇందుకూరిపేట, కొడవలూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఆనంద్‌ వెల్లడించారు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు. డివిజన్‌, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్​లు ఏర్పాటు చేయడంతో పాటు పెన్నా నది గట్లు పరిశీలించాలని రెవెన్యూ, నీటి పారుదల అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్​ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. (దసరా సెలవులు ముగియడంతో ఏపీలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వర్షం కారణంగా పలు జిల్లాల్లో నేడూ సెలవు ప్రకటించారు. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు.)

అల్పపీడనంతో ఎఫెక్ట్‌ - అప్రమత్తమైన అధికారులు : ప్రకాశం జిల్లా మద్దిపాడ, ఒంగోలు, గిద్దలూరు, కొమరోలులో కూడా ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. భారీ వర్షంతో ఒంగోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. చీరాల, చినగంజాం, బాపట్ల, వేటపాలెం, కారంచేడు, మార్టూరు, పర్చూరు, కొల్లూరు, ఇంకొల్లు, అద్దంకి, వేమూరు, జె.పంగులూరు, యద్దనపూడి, బల్లికురవ, కర్తపాలెం, నిజాంపట్నంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు, మచిలీపట్నం, అవనిగడ్డలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అన్నమయ్య జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, స్తంభాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశించారు.

ఏపీకి తుఫాన్‌ హెచ్చరిక! - మరోసారి జల ప్రళయం తప్పదా!?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.