ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు - మరో ఐదురోజులు ఇదే పరిస్థితి - Heavy Rains In Telangana

Heavy Rains Effect In Telangana : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్ , మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చేతికొచ్చిన పంటలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలి రహదారులపై పడటంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

Heavy Rains In Telangana
Heavy Rains Effect In Telangan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 7:46 AM IST

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు - మరో ఐదురోజులు ఇదే పరిస్థితి (ETV Bharat)

Heavy Rains In Telangana : రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలు ప్రజలను అతలాకుతంలం చేశాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యంపై టాపర్‌లు కప్పడానికి వెళ్లి తాతా మనవళ్లు పిడుగుపడి మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామ శివారులో పిడుగు పడటంతో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధితులను పరామర్శించారు. పిడుగు పడి ముగ్గురు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిడుగు పాటుతో గాయపడిన వారికి వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరిక - 4 రోజులపాటు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Telangana Weather Report

Rains in Telangana on Lok Sabha Polling Day : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టెంట్లు పూర్తిగా కింద పడిపోయాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ ఈదురు గాలులకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలోని టెంట్లు కుప్పకూలాయి. కామారెడ్డిలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఎన్నికల సామగ్రి తరలింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో టెంట్లు కుప్పకూలాయి.

ఈవీఎంలు తడవకుండా కాపాడేందుకు అధికారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్, మేళ్లచెరువు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుసింది. ఈదురు గాలుల కారణంగా అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపోవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు : మూడు రాష్ట్రాలలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా దక్షిణ, ఆగ్నేయ దిశలలో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ముగ్గురి మృతి - స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి - Heavy Rains Effect in Telangana

అలర్ట్ - అలర్ట్ - అలర్ట్ - హైదరాబాద్​కు భారీ వర్ష సూచన - అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు కాల్ చేయండి - telangana weather news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.