Heavy Rain in Hyderabad : ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని ఖైరతాబాద్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బంజారాహిల్స్ సహా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికే నీరంతా రోడ్లపైకి వచ్చి చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వర్షానికి ఎక్కడా జనం ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడా నీళ్లు నిలిచిపోకుండా, డ్రైనేజ్ పొంగిపొర్లిన చోట ప్రజలకు ఇబ్బంది లేకుండా బల్దియా సిబ్బంది చర్యలు చేపట్టారు.
టోలిచౌకిలో కూలిన భారీ చెట్టు : హైదరాబాద్ నగరంలో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్‌లోని ఈదురు గాలులతో 200 సంత్సరాల నాటి చెట్టు నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తలకు గాయాలు కాగా, 4 బైక్స్ ధ్వంసమయ్యాయి.
Heavy Monsoon Rainfall in Hyderabad : జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించటంతో, పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలోని నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
నగరంలోని అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అటు మలక్ పేట, చాదర్ ఘాట్, సైదాబాద్, సంతోశ్‌నగర్, చంపాపేట్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లోను వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
Minister Ponnam on Hyderabad Rains : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్‌ల వద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భారీ వర్షాలు కారణంగా అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు.
వర్షాకాల అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణం స్పందించాలి : సీఎం రేవంత్
వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే - ఇన్ఫెక్షన్లకు గుడ్‌బై చెప్పొచ్చు! - Fruits to Fight With Infections