ETV Bharat / state

తెలంగాణను వణికిస్తున్న వరుణుడు - ఇబ్బందులు పడుతున్న ప్రజానికం - Heavy Rains IN Telangana - HEAVY RAINS IN TELANGANA

Heavy Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు , ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Rains In Hyderabad
Heavy Rains IN Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 10:59 AM IST

Updated : Aug 31, 2024, 7:34 PM IST

Heavy Rains In Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, కాజీపేటలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా గార్ల మండల శివారులో గల పాకాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా గార్ల నుంచి రాంపురం, మద్దివంచతో పాటు పలు తండాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్వతగిరి మండలం పెద్ద తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో దంచికొట్టిన వాన : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. వానల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నారాయణపేట మండలం అభంగాపూర్ వద్ద వాగు పొంగింది. ధన్వాడ మండలం మందిపల్లి, పాతపల్లి, ఎమ్మనోనిపల్లి వద్ద వాగులు పొంగి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా ఇతర పంటలు నీట మునిగాయి. మద్దూరు-బూనీడు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో సరళాసాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. జడ్చర్ల మండలంలోని వందపడకల ఆసుపత్రిలోకి భారీగా వర్షం నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు.

ఉమ్మడి ఖమ్మంలో పొంగుతున్న వాగులు, వంకలు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, మండలాలను వరుణుడు వదల్లేదు. మధిర నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. మధిర- విజయవాడ, మధిర - ఖమ్మం మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం పాతర్లపాడు వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరడంతో బోనకల్ ఖమ్మం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామం సమీపంలో వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మోకు సహాయంతో స్థానిక ప్రజలు కాపాడారు. మధిర మండలం మాటూరు విద్యానగర్ కాలనీలో ప్రధాన విద్యుత్తు లైన్‌ వైరు తెగి ఇల్లు మీద పడటంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు శివారు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొట్టుకుపోయిన వంతెన 40 గ్రామాలు అంధకారంలో : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం దంచికొట్టింది. మిర్యాలగూడలోని విద్యుత్ కార్యాలయం ముందు భాగం నీటితో నిండిపోయింది. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోయి 40 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. హుజుర్‌నగర్‌లో డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి మురుగు నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్​ను వీడని ముసురు : హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురుస్తోంది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్‌లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన వాననీటితో వాహనదారులు, ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట ప్రాంతాలలో వర్షం కురిసింది.

కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వికారాబాద్‌లోని మద్గుల్‌లో చిట్టంపల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శివసాగర్‌ ప్రాజెక్టు అలుగుపారుతుండగా సర్పంచ్‌పల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రానున్న 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు! - IMD ALERT TO TELANGANA

రాష్ట్రంలో ఇవాళ, రెేపు భారీ వర్షాలు - ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్​

Last Updated : Aug 31, 2024, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.