ETV Bharat / state

కకావికలం అవుతోన్న శ్రీకాకుళం- వాయుగుండం ప్రభావంతో దంచికొడుతున్న వానలు - Heavy Rains in Srikakulam District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 6:14 PM IST

Heavy Rain Falling in Srikakulam District : వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఐఎండీ విభాగం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నడుమ విద్యాసంస్థలకు కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు.

Heavy Rain Falling  in Srikakulam District
Heavy Rain Falling in Srikakulam District (ETV Bharat)

Heavy Rain Falling in Srikakulam District : వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవం అస్థవ్యస్థం అవుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఈరోజు(ఆదివారం) వరకూ ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల వల్ల జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు. ఉరుములు, గాలులు లేకుండానే భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా వీధుల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పొంగే పరిస్థితి నెలకొంది. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలని సూచనలు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వాయుగుండం శ్రీకాకుళంకీ 350 కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆది, సోమవారాల్లో 150 నుంచి 200 మి.మి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కారణంగా రహదారులు, పాఠశాలలు, కళాశాలలో మైదానాలు జలమయం అయ్యాయి. వర్షాలతో నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉందని, నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు.

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra

మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లవద్దు : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లకూడదని అదేశాలు జారీ చేశారు.

పీకల్లోతుచేరిన నీటితో ప్రజలు అవస్థలు : ఆమదాలవలస మండలం నాగావళి నది పరివాహక ప్రాంతాలను ఇరిగేషన్ ఎస్సీ పొన్నాడ సుధాకర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కాలువలు పొంగే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గడ్డకంచరాంలో పెద్ద గెడ్డ పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణంరాజుపేట-యాదపేట గ్రామాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పీకల్లోతుచేరిన నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వ్యానుతోపాటు కొట్టుకుపోయన డ్రైవర్ : జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ ఓమినీ వ్యాను కొట్టుకుపోయింది. లావేరి మండలం బెజ్జపురం- బుడతవలస గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వ్యానుతోపాటు డ్రైవర్‌ కొట్టుకు పోతూ ఉండగా స్థానికులు కాపాడారు. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన : జి.సిగడాం మండలం గడ్డకంచరాంలో పెద్ద గెడ్డ పొంగింది. కృష్ణంరాజుపేట-యాదపేట గ్రామాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పీకల్లోతు నీటిలో ప్రజలు ఆవస్థలు పడుతున్నారు. నరసన్నపేట మండలం గుండిబిల్లిపేటలోని రైస్‌మిల్లు సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేల కూలిపోయింది. రైస్ మిల్లుకు చెందిన 80 అడుగుల పొడవు గల ప్రహరీ గోడ నేలమట్టం అయింది. వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert

విజయవాడలో ముమ్మరంగా వరద సహాయక చర్యలు- నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం - FLOOD RELIEF

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.