ETV Bharat / state

హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం - Heavy Rain Effect In Hyderabad - HEAVY RAIN EFFECT IN HYDERABAD

Heavy Rain Effect In Hyderabad : భారీ వర్షాలకు హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ నీటిమట్టం పెరిగి నిండుకుండలా మారింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

Heavy Rain Effect In Hyderabad
Heavy Rain Effect In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 4:38 PM IST

Updated : Sep 1, 2024, 8:05 PM IST

Heavy Rain Effect In Hyderabad : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్​సాగర్​లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. బుల్కాపూర్, కూకట్​పల్లి, బంజరా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం పెరిగి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎఫ్​టీఎల్​కు అడుగుదూరంలో ఉండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్​లో వరదనీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ కూడా సాగర్​లోని నీటిమట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలడిగి తెలుసుకుంటున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని ఆయన సూచించారు.

Hydra Commissioner visits Flood Affected Areas : నగరవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. షేక్​పేట, టోలిచౌకీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. టోలిచౌకి వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీటిని దగ్గరుండి సిబ్బందితో నాలాలోకి మళ్లించారు. అలాగే బేగంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నాలాను, పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

భారీ వర్షాలకు కూలిన చెట్లు, గోడలు : భారీవర్షాలతో మెహిదీపట్నం నుంచి లింగంపల్లి మార్గంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ అండర్ పాస్ నీట మునిగింది. వర్షాలకు గాంధీభవన్‌ ప్రహరీ గోడ కూలింది. పార్కింగ్‌ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. లిబర్టీలోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు చెట్టు కూలి పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హిమాయత్ నగర్​లో రహదారిపై చెట్లకొమ్మలు పడటంతో ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని కళింగ ఎంక్లేవ్ వద్ద భారీ వృక్షం హై టెన్షన్ వైర్లపై కూలింది. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై కూడా ఓ భారీ వృక్షం కూలింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఈసీ ప్రవాహంతో మూసీకి వరద పొటెత్తుతోంది. జియాగూడ, చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వద్ద వంతెనలను తాకుతూ ప్రవహిస్తోంది.

భారీ వర్షాలతో నిండుకుండల్లా ప్రాజెక్టులు - గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు - Sagar 26 Gates Opened\

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi

Last Updated : Sep 1, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.