ETV Bharat / state

వరద ప్రవాహంతో గోదావరి పరవళ్లు - నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు - Irrigation Projects in Telangana - IRRIGATION PROJECTS IN TELANGANA

Heavy Water Flow In Godavari : ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్‌లోకి ప్రవాహం ఆశాజనకంగా ఉంది. ఇక జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది.

Heavy Flood Water Flow To Telangana Water Projects
Heavy Water Flow In Godavari (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 12:27 PM IST

Heavy Flood Water Flow To Telangana Water Projects : ఎగువన కురుస్తున్న వర్షాలకు గంగమ్మ ఉరకలెత్తతుతోంది. ప్రాజెక్టుల నీటిమట్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో 23 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయంలోకి 18 వేల క్యూసెక్కుల జలాలు వస్తున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 720 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 17టీఎంసీలు కాగా ప్రస్తతం 4 టీఎంసీల మేర నీరు ఉంది. సింగూరు ప్రాజెక్టులోకి క్రమంగా వరద చేరుతోంది. ఇన్‌ఫ్లో 3 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరు ఉంది.

టెన్షన్! టెన్షన్​! - 53.6 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ - Heavy Water Flow in Godavari

Jurala water Level Today: కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లోనూ వరద ఆశాజనకంగా ఉంది. జూరాల జలాశయానికి ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా 41గేట్ల ద్వారా 2లక్షల 90 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.62 టీఎంసీలుగా అధికారులు నిర్వహిస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, తుంగభద్ర డ్యాంల నుంచి వస్తున్న వరద అధికమైంది. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల మేర వరద చేరుతోంది. ఐదు రోజుల్లోనే దాదాపు 50కి పైగా టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌ జలాశయానికి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 509 అడుగులుగా ఉంది.

Bhadrachalam Water Level Today : భద్రాచలం గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుత నీటిమట్టం 52 అడుగులుగా కొనసాగుతూ ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. దీంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

జూరాలకు జలకళ - పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి - Huge Water Inflow To Jurala Project

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.