ETV Bharat / state

పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి - Floods Damage in Telangana - FLOODS DAMAGE IN TELANGANA

Flood Effects in Telangana : భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి రవాణాపై తీవ్ర ప్రభావం పడగా పంట చేలల్లో ఇసుక మేటలు వేసి వాటి స్వరూపం కోల్పోయింది. ఏరు ఊర్లపై పడటం వల్ల కోలుకులేని దెబ్బ పడిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మరో పంట సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు.

Floods Damage in Khammam and Mahabubabad
Flood Effects in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:44 PM IST

Floods Damage in Khammam and Mahabubabad : భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల మధ్య జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉద్ధృతికి ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోగా రెండు జిల్లాల మధ్య ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. లక్షలాది పెట్టుబడి వరదార్పణమైందని సాగుదారులు వాపోయారు. పొలాలు బాగుచేసుకుని, మరోపంట సాగు చేయాలంటే తమ తరం కాదని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే చేయూతనివ్వాలని బాధిత కర్షకులు కోరుతున్నారు.

వరద మిగిల్చిన విషాదం వల్ల కనీసం పొలాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు ఇటీవల కురిసిన వర్షానికి తెగి గోపాలపురం నుంచి బూరుగడ్డ, కరక్కాయలగూడెం వెళ్లే రహదారి ధ్వంసమైంది. నాలుగు రోజుల నుంచి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లేందుకు వీలు లేక పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు చెరువుల నుంచి దారి చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. తెగిన రోడ్డుకు మరమ్మతులు చేసి సాధారణ స్థితికి రోడ్డును తేవాలని ప్రజలు కోరుతున్నారు.

'కురిసిన భారీ వర్షాలకు నల్లచెరువు తెగిపోయి రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. దాదాపు నాలుగైదు గ్రామాలు ఈ దారి నుంచి వెళుతారు. కానీ ప్రస్తుతం చెరువు తెగిపోవడంతో వాహనదారులు, స్కూల్​ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసరం ఉంటే చెరువు చుట్టూ నడిచి వెళ్లడం లేదా చెరువులోని తక్కువ ఉన్న నీళ్లలో నుంచి నడవాల్సి వస్తోంది'- స్థానికులు

దాదాపు ముంపునకు గురైన 200 ఇళ్లు : పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు తప్ప ఏం లేకుండా పోయిందని, వాటిని బాగు చేసుకోవాలంటే కనీసం ఎకరానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎకరా సాగు కోసం రూ.30 వేలు ఖర్చు చేసినట్లు వివరించారు. అధికారులు త్వరగా నష్టం వివరాలను లెక్కగట్టి పరిహారం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామం వరద తాకిడికి విలవిలలాడింది. దాదాపు 200 ఇళ్లు ముంపునకు గురయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

వర్షాలకు నిండుకుండలా మారిన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టును ఎమ్మెల్యే భూపతిరెడ్డి సందర్శించారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎడమ కాలువకు మరమ్మతులు చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. ఏకధాటి వర్షాలకు భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు, చెరువులు, కుంటలకు ప్రవాహం పోటెత్తి పొలాలను ముంచెత్తింది. ఎన్నో ఆశలతో సాగుచేసిన అన్నదాతలకు పోటెత్తిన వరద శాపంగా మారింది. చేలన్నీ చెరువులుగా మారగా సాగుదారులకు గుండెకోత మిగిలింది.

పట్టించుకున్నవారే కరవయ్యారని : ఆంధ్రా సరిహద్దులోని రామాలయం భూమిలో ఉన్న చెరువు వర్షాలకు పొంగుతోంది. ఫలితంగా భద్రాచలం శివారులోని కాలనీ వాసులు ఏ సమయంలో వరద ముంచెత్తుతుందోనని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఓ వైపు గోదావరి, మరోవైపు చెరువు వరద చూసి భయం గుప్పిట్లో గడపుతున్నారు. రెండు రాష్ట్రాల అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్నవారే కరవయ్యారని వాపోతున్నారు. భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరగకముందే వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024

మానవ తప్పిదాలే పెనుశాపాలుగా మారాయా? - Causes OF Floods In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.