ETV Bharat / state

వైసీపీ కబంద హస్తాల్లో హథీరామ్‌జీ మఠం- హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చినా ఆగని విల్లాల నిర్మాణం - Hathiramji Matt lands

Hathiramji Matt Lands: హథీరామ్‌జీ మఠానికి చెందిన వందల ఎకరాలు వైసీపీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. అధికార పార్టీ అంటే 'చెవి'కోసుకుంటా అనేలా హడావిడి చేసే ఓ కీలక నేత ఆధ్వర్యంలో మఠం భూముల ఆక్రమణ తారాస్థాయికి చేరింది. హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా మఠం భూముల్లో నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

Hathiramji_Matt_Lands
Hathiramji_Matt_Lands
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:02 AM IST

వైసీపీ కబంద హస్తాల్లో హథీరామ్‌జీ మఠం- హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చినా ఆగని విల్లాల నిర్మాణం

Hathiramji Matt Lands: తిరుపతి గ్రామీణ మండలంలోని అవిలాల పరిధిలో దాదాపు 200 ఎకరాలకుపైనే హథీరామ్‌జీ మఠానికి చెందిన భూములు ఉన్నాయి. వీటిని సాగు పేరిట లీజు తీసుకున్నట్లు చూపించి, భారీ భవంతులు, విల్లాలు నిర్మిస్తున్నారు. గతేడాది వరకూ మఠం బాధ్యతలు చూసిన మహంతు అర్జున్‌దాస్‌ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కోర్టుల్లో కేసులు ద్వారా గట్టిగా అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు. ముఖ్యంగా అధికారపార్టీలో ఆ కీలక నేత ఆధ్వర్యంలో ఈ మఠం భూముల్లో దందా సాగింది.

వైసీపీ నేతలు వీటిల్లో పాగా వేశారు. ఇదే భూముల్లో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలకు వైసీపీలో ఓ కీలక నేత విల్లాలు కట్టించి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎమ్​ఆర్​పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సర్వే నంబరు 242/బీ లో హథీరామ్‌జీ మఠానికి చెందిన 9.89 ఎకరాల్లో ఇద్దరు వేర్వేరుగా సాగు చేసుకునేందుకు లీజు తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ కోర్టు ద్వారానే ఆ లీజు ఆదేశాలు రప్పించుకొని, ఎకరాకు ఏటా రూ.2 వేలు చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు.

గెలుపే లక్ష్యంగా జనంలోకి టీడీపీ అభ్యర్థులు- వైసీపీలో కొనసాగుతున్న వలసలు

అయితే వాటిలో భవంతులు నిర్మిస్తున్నారు. ఇందులో 5.73 ఎకరాల్లో ఇద్దరు సోదరులు విల్లాలు నిర్మిస్తుండటంపై గతనెల మొదటివారంలో మఠం అధికారులు ఆక్రమణ తొలగింపు నోటీసు జారీచేశారు. నిర్మాణాలు చేస్తున్న లీజుదారులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, మఠం అధికారులు అక్కడి నిర్మాణాల ఫొటోలను కోర్టు ముందు ఆధారాలుగా చూపారు. యథాతథస్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఆ భూముల్లో నిర్మాణాలు ఆపలేదు. ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీసుకురావాలంటూ ఇద్దరు మఠం ఉద్యోగులను అధికారులు పంపారు. విషయం తెలుసుకున్న కీలక నేత అనుచరులు అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు ఉద్యోగుల్ని గదిలో బంధించి చితక్కొట్టినట్లు తెలిసింది. చివరగా వారి చేతిలో డబ్బులు ఉంచి ఫొటోలు తీసినట్లు సమాచారం. ఎవరికైనా ఫిర్యాదు చేసినా, మీడియాకు చెప్పినా, డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఏసీబీకి పట్టిస్తామని హెచ్చరించారు.

యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన- ఈసీ ఆదేశాలు బేఖాతరు!

బయటకు ఇదంతా తెలిస్తే అంతు చూస్తామని తీవ్రస్థాయిలో బెదిరించినట్లు తెలిసింది. ఎమ్​ఆర్​పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న భూమిలోనే ఇదంతా జరిగినా ఇప్పటి వరకు మఠం అధికారులుగానీ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. విషయం దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలిసినట్లు సమాచారం.

అయితే ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన కీలక నేత దీని వెనుక ఉండటంతో పాటు, అదే ప్రాంతంలో ఇద్దరు పోలీసు అధికారులు నిర్మించుకున్న భవంతులు కూడా ఉండటంతో దేవదాయశాఖ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. హథీరామ్‌జీ మఠానికి అవిలాల, తుమ్మలకుంట, చింతలక్ష్మీకాలనీలో ఉన్న భూములు ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా అవిలాలలో ఎక్కువగా రాజకీయ నేతలు, ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసు శాఖలో అధికారులు, ప్రముఖులు దర్జాగా భారీ భవంతులు, విల్లాలు నిర్మించుకున్నారు.

వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్న అధికారులపై వేటు!- కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

గతేడాది మఠం మహంతును ప్రభుత్వం తొలగించి, ఓ డిప్యూటీ కలెక్టర్‌ను ఫిట్‌ పర్సన్‌గా నియమించింది. ఆ తర్వాత మఠం సిబ్బంది ఏదైనా ఆక్రమణల జోలికి వెళ్తే ముందుగా అవిలాలలో బడాబాబుల భవంతులను కూల్చిన తర్వాత మా వద్దకు రండి అని ఆక్రమణదారులు ఎదురుతిరుగుతున్నారు. అయితే అవిలాలలో ఆక్రమణలు, నిర్మాణాల వెనుక కీలక నేత, ఆయన సోదరుడు ఉండటంతో అధికారులు వాటి జోలికెళ్లే సాహసం చేయడంలేదు.

గతంలో ఉన్న మఠం మహంతు నిర్లక్ష్యం, కోర్టులో సకాలంలో అప్పీల్స్‌కు వెళ్లపోవడం కారణంగా వివిధ సర్వే నంబర్లలో 174.75 ఎకరాలు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమికిగా మార్చి, ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఈ భూములన్నీ నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అయినా సరే అంతా స్టాంప్‌ పేపర్లపై అగ్రిమెంట్ల ద్వారా దందా సాగిపోతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.