ETV Bharat / state

గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్‌ విక్రయాలు - పోలీసుల అదుపులో నలుగురు

హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల హాష్ ఆయిల్‌ స్వాధీనం - కేసును బాలానగర్ పోలీసులకు అప్పగించిన పోలీసులు

Police Seized Hash Oil in Hyderabad
Police Seized Hash Oil in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Police Seized Hash Oil in Hyderabad : హైదరాబాద్​ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసి విక్రయిస్తోన్న హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ అమ్ముతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సోదాలు నిర్వహించి 3 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం బాలానగర్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు.

రాజేంద్రనగర్​లో హాష్ ఆయిల్ పట్టివేత : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి బండ్లగూడలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌న్యాబ్‌) అధికారులు 300 ఎంఎల్‌ హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు రహీమ్‌ ఉన్నీసా అనే మహిళ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు, చిన్న చిన్న బాటిల్స్‌లో నిల్వ చేసిన హాష్ ఆయిల్‌ను ఐడెంటిఫై చేసి సీజ్‌ చేశారు. నిందితురాలిని అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.