Harish Rao Tweet On Crop Damage in Telangana 2024 : అకాల వర్షాల కారణంగా వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని, పంట నష్టానికి పరిహారం చెల్లించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాల కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పదించ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్కు కేవలం రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. గతంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ తక్షణం రైతులను కలిసి ఎకరాకు రూ.10వేల పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని, ఈ సమయంలో కర్షకులకు ప్రభుత్వమే అండగా నిలవాలని కోరారు.
వడగళ్ల వానతో నష్టపోయిన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో పంటనష్టం అంచనా వేయాలని హరీశ్ రావు కోరారు. వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్నతోపాటు బొప్పాయి, మామిడి సహా ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తక్షణం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Alternate Crops in Telangana : వర్షాభావం తప్పేలా లేదు.. మరి ఏం వేస్తే బాగుంటుంది..?
Untimely Rains Causing Crop Damage in Telangana : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరిగ్గా చేతికొచ్చే సమయానికి చెడగొట్టు వాన వచ్చి రైతుల కష్టమంతా నీటిపాలు చేసింది. రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షం, ఈదురు గాలులతో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో రెండు రోజుల వ్యవధిలో వ్యవధిలో వీచిన ఈదురుగాలులు, వర్షం అన్నదాతలకు భారీ నష్టాన్నీ తీసుకొచ్చింద. మొక్కజొన్న, వరి, నువ్వులు, ఇతర పంటలు దాదాపు వెయ్యి ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిశాయి.
Heavy Crop Damage : గోదావరి పరివాహక ప్రాంతాలైన మునిపెల్లి, పార్పెల్లి, మల్లాపూర్, చింతల్చాంద, పీచర, ధర్మారం, చామన్పెల్లి, తిర్పెల్లి, తదితర గ్రామాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నువ్వుల పంట 659 ఎకరాల్లో, మొక్కజొన్న 303 ఎకరాల్లో, వరి 120 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న కోత దశలో ఉండగా నీటిపాలయింది. దాదాపు 1082 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వం ఆదుకుని పరిహాకం అందజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి