ETV Bharat / state

సన్‌ఫ్లవర్‌ రైతులను ఆదుకోండని తుమ్మలకు హరీశ్‌ లేఖ - రేపటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం - తుమ్మల నాగేశ్వరరావుకు హరీశ్‌ లేఖ

Harish Rao Open Letter to Thummala Nageswara Rao : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలకు మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సన్‌ఫ్లవర్‌ రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఈ సమస్యపై మంత్రి తుమ్మల స్పందించారు. రాష్ట్రంలో రేపటి నుంచే పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన మార్క్​ఫెడ్ అధికారులను ఆదేశించారు.

Harish Rao Open letter to Tummala Nageswara Rao

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 2:30 PM IST

Updated : Feb 22, 2024, 3:02 PM IST

Harish Rao Open Letter to Thummala Nageswara Rao : రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్‌ పండించిన రైతులకు మద్దతు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్‌ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి (Tummala Nageshwara Rao) బహిరంగ లేఖ రాశారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ.6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ.4000ల నుంచి రూ.5000లకే అన్నదాతలు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో సన్‌ఫ్లవర్‌ రైతులు (Sunflower Crop) ప్రతి క్వింటాల్‌కు దాదాపు రూ.2,000 నష్టపోతున్నారన్నారని హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు.

Harish Rao on Sunflower Crop : తమ ప్రభుత్వం హయాంలో మార్కెట్ యార్డుల ద్వారా మద్దతు ధరకు రైతుల నుంచి సన్‌ఫ్లవర్‌ పంటను కొని ఆదుకున్నామని హరీశ్‌రావు (Harish Rao) గుర్తు చేశారు. దీనిపై వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి స్పందించాలని కోరారు. అధికారులను ఆదేశించి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్‌ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నట్లు హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

ఇటీవలే హరీశ్‌రావు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హమీ ఇచ్చిన ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు (Raithu Bandhu) సాయం రూ.15,000లకు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. రైతుబంధు గురించి కొందరు నేతలు అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కాంగ్రెస్​కు హరీశ్‌రావు సవాల్ విసిరారు.

Minister Tummala Reply to Harish Rao Letter : మరోవైపు పొద్దు తిరుగుడు రైతుల సమస్యలపై మంత్రి తుమ్మల స్పందించారు. పొద్దుతిరుగుడు రైతులు తొందరపడవద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కోతలు ఆరంభమైన దృష్ట్యా మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పొద్దుతిరుగుడు పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కనీస మద్దతు ధర రూ.6760 కంటే తక్కువ ధరకు తొందరపడి విక్రయించవద్దని రైతులకు సూచించారు.

త్వరలోనే కర్షకులకు రుణమాఫీ - కౌలుదారులకు రైతుబంధు

Harish Rao Letter To Uttam On Farmers Issue : ఇటీవలే సిద్దిపేట జిల్లా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar)కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు లేఖ రాశారు. గత మూడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామని, తద్వారా పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని హరీశ్‌ రావు లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు కొనసాగించాలి - సీసీఐని కోరిన మంత్రి తుమ్మల

Last Updated : Feb 22, 2024, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.