ETV Bharat / state

సీఎం సాబ్!! ప్రభుత్వంలో టీఎస్​ఆర్టీసీ విలీనం ఎప్పుడు? : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 4:47 PM IST

Harish Rao On TSRTC Merging in Govt : తెలంగాణ ఆర్టీసీ విలీనంపై సీఎం రేవంత్​ రెడ్డికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు లేఖ రాశారు. విలీన తేదీని ప్రకటించాలని లేఖలో కోరారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాడు బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆర్టీసీ విలీన బిల్లు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

Harish Rao letter to CM Revanth Reddy
Harish Rao letter to CM Revanth Reddy on TSRTC Merger

Harish Rao On TSRTC Merging in Govt : టీఎస్​ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు.

ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)ను కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్​ తమిళిసై తొలుత ఆమోదించలేదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో హరీశ్​రావు గుర్తు చేశారు. ఎన్నికల కోడ్​ నేపథ్యంలో అప్పట్లో అపాయింటె​డ్​ డేను ప్రకటించలేకపోయామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసే రోజును ప్రకటించాలని కోరారు.

Harish Rao letter to CM Revanth : కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆర్టీసీ విలీనం ఊసెత్తలేదని సీఎం రేవంత్​ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం(Women Free Bus) ప్రారంభించిన రోజే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారని అన్నారు. కానీ మహిళలకు ఉచిత బస్​ సర్వీసులు ప్రారంభించిన తర్వాత కండక్టర్లు, డ్రైవర్లకు పని భారం పెరిగిందని తెలిపారు. సిబ్బందిపై పని భారం కూడా పెద్ద మొత్తంలో పెరిగిందని లేఖలో హరీశ్​రావు వెల్లడించారు.

మహిళలకు ఉచిత పథకం ఎఫెక్ట్​ మాములుగా లేదుగా- 11 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణాలు

మరో 2000 బస్సులు కొనుగోలు చేయాలి : ఈ నేపథ్యంలో వారి సేవను గుర్తించి వెంటనే విలీన తేదీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక బస్సుల్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 2,000 బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్​కు పేమెంట్​ చేస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిందని హరీశ్​రావు గుర్తు చేశారు. బాండ్స్​కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

గతంలో టీఎస్​ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అసెంబ్లీలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లును గవర్నర్​కు పంపగా కొన్ని వివరాలపై పూర్తి సమాచారం, వివరణ ఇవ్వాలని తమిళిసై సౌందరరాజన్ బిల్లును తిరిగి వెనుకకు పంపారు. ఆ తర్వాత ప్రభుత్వం బిల్లుపై పూర్తి వివరణ ఇవ్వడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ మారడంతో ఆర్టీసీ ప్రభుత్వ విలీనం గొడవ ముందుకు సాగడం లేదు.

కేంద్రంలో కాంగ్రెస్​ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్​రావు

ప్రాణిహత చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్​రావు, భట్టి మధ్య డైలాగ్​ వార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.