ETV Bharat / state

YUVA : కలల కొలువు సాధించిన వేళ - నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయిన ఖమ్మం యువకుడు - Khammam Man Bags Four Govt Jobs - KHAMMAM MAN BAGS FOUR GOVT JOBS

Khammam Man Bags Four Govt Jobs : చదివిన చదువుకు సార్థకత ఉండాలన్నా, కన్నవారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వ కొలువు సాధించే వరకు విశ్రమించేదే లేదని పట్టుబట్టాడు ఈ యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాజధానికి పయనమై, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔ‍రా అనిపించాడు. ఈ ఖమ్మం యువకుడి ఉద్యోగాల సాధన విజయగాథ తెలుసుకుందాం.

GURUVESWARA RAO GOT FOUR GOVT JOBS
Khammam Man Bags Four Govt Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 2:28 PM IST

GURUVESWARA RAO GOT FOUR GOVT JOBS : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన రైతు దంపతులు సత్యనారాయణ, లక్ష్మీ కుమారుడు ఇనపాల గురువేశ్వరరావు. సాధారణ మధ్యతరగతి వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టిన గురువేశ్వరరావు చిన్నప్పటికీ నుంచీ సరస్వతీ పుత్రుడే. పాఠశాల విద్య మొదలైనప్పటి నుంచే చదువుల్లో గురువేశ్వరరావే టాపర్. పదోతరగతి వరకు పేరువంచ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు.

సర్కారీ కొలువులపైనే గురి : ఇంటర్ కల్లూరులో పూర్తి చేశాడు. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచీ ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న గురువేశ్వరరావు, బీటెక్ తర్వాత సర్కారీ కొలువులపైనే గురి పెట్టాడు. తాను పెట్టుకున్న లక్ష్యంపై చిన్నప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ యువకుడు, అందుకు అనుగుణంగానే ఎక్కడా ఏమరపాటుకు తావులేకుండా అనుకున్న లక్ష్యం వైపు చదువుల పయనం సాగించాడు.

మొక్కవోని దీక్షతో సాధన : బీటెక్ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్న గురువేశ్వరరావు, హైదరాబాద్‌కు పయనమయ్యాడు. పోటీ పరీక్షలకు శిక్షణ నిచ్చే సంస్థలో చేరి, అక్కడి నుంచి విరామం లేకుండా పట్టుదలతో చదివాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో అనేక ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ప్రభుత్వ ఉద్యోగ వేటలో నిమగ్నమైన గురువేశ్వరరావు, ఉద్యోగం సాధించిన తర్వాత సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఒకటి రెండు కాదు ఏకంగా వరుసగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు. తొలుత నీటి పారుదలశాఖలో 2022లో విడుదలైన ఏఈ ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రస్థాయి 253వ ర్యాంకుతో కొలువు సాధించాడు. తర్వాత గ్రూప్-4 లో 1825 ర్యాంకుతో ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 215వ ర్యాంకు పొందాడు. తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసిన నీటిపారుదలశాఖ ఏఈఈ నియామక పరీక్షలో 257 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు.

ఒకసారి లక్ష్యం నిర్దేశించుకుంటే వెనకడుకు వేయకుండా సాధించే వరకు పట్టుదలతో ముందుకెళ్లాలన్నదే తన ఉద్దేశమని గురువేశ్వరరావు చెబుతున్నాడు. నీటిపారుదలశాఖ ఏఈఈ ఉద్యోగంలో చేరుతానని గురువేశ్వరరావు అంటున్నాడు. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. సరస్వతీ పుత్రుడిగా కుమారుడు సాధిస్తున్న విజయాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

"పదోతరగతి వరకు పేరువంచ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నీటిపారుదలశాఖ ఏఈఈ ఉద్యోగంలో చేరుతాను". - గురువేశ్వరరావు

YUVA: నాటుకోళ్లతో రూ.కోట్ల సంపాదన​ - ఈ యంగ్ టెకీ బిజినెస్ ఐడియా అదుర్స్ - COUNTRY CHICKEN CO IN HYDERABAD

YUVA : సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు - యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న నల్గొండ యువ రైతు - Organic Farming in Nalgonda

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.