Identification eligible for Indiramma Housing Scheme : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. వచ్చే నెల మొదటి వారం తర్వాత దరఖాస్తుల పరిశీలన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణియించగా అందుకోసం ప్రస్తుత బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించింది. ఇళ్ల కోసం ఇప్పటివరకు సుమారు 82.83 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ పథకానికి ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించనుంది దానికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నిపుణలు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ముందుగా స్థలం ఉన్నవారిని గుర్తించాలని సర్కార్ నిర్ణయించింది. నిబంధనల మేరకు ఎంతమంది అర్హులో గుర్తించి వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించడంతో వారు ఆ పనిలో పడ్డారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఏయే పథకాన్ని కోరుకుటున్నారనన్న వివరాలను అధికారులు కంప్యూటరీకరించారు. స్థలం ఉన్నవారిని మొదట గుర్తిస్తారు. అర్హులకు ఇళ్లను కేటాయించే విషయంలో నియోజకవర్గం స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను నియమించాలని ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది.
పేద ప్రజలకు గుడ్ న్యూస్ - ఈ నెలాఖరు నుంచే 'ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ' ఎంపిక
విధివిధానాలు సైతం జారీ : ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయి. రెండు, మూడు, జిల్లాల్లో మినహా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఉన్నతాధికారి ఈటీవీ భారత్‌తో చెప్పారు. దరఖాస్తుల పరిశీలను డిసెంబర్ మొదటి లేదా రెండో వారం నుంచి చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన అనంతరం ఇళ్ల కేటాయింపులు చేస్తారు. నిర్మించాల్సిన ఇంటి నమూనాతో పాటు అందుకు సంబంధించిన విధివిధానాలను సైతం జారీ చేయగా దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కదలిక రానుంది.
ప్రత్యేక యాప్ రూపకల్పన : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల సెలక్షన్ విధానం పారదర్శకంగా ఉంటుందని,ప్రాంతాలు, రాజకీయ పార్టీలు ఇలాంటివి ఏ బేధాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు పంపిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులను చేయాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వారికే తొలి ప్రాధాన్యం - అదనపు గదులకు అనుమతి
ఇందిరమ్మ ఇళ్లు అప్టేడ్: తొలి దశలో వీరికి మాత్రమే ఛాన్స్ - రూ.5 లక్షలు ఇచ్చేది అప్పుడే