AP Govt on Liquor Rates: మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.
మందుబాబులకు కిక్కే కిక్కు - తగ్గిన మద్యం ధరలు
మందుబాబులకు గుడ్న్యూస్ - నాణ్యతపై దృష్టి - ఎంఆర్‌పీ మించి అమ్మితే 5లక్షలు ఫైన్