Govt Issued Orders Appointing Special Officers to Gram Panchayaths : రాష్ట్రంలో సర్పంచ్‌ల పాలనకు తెరపడింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియామిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఇవాళ్టి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.
Special Officers in Gram Panchayaths in Telangana : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులను నియమించారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, ఎంఈవో, మండల పంచాయతీ అధికారి స్థాయి సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా(Govt Appointed Special Officers) నియమించారు. సర్పంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
'మా పదవి కాలం పొడిగించండి లేదంటే అప్పుల బాధ తట్టుకోలేం'
Special Officers to Gram Panchayaths : ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీ కాలం ముగుసినందున, వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
'సర్పంచ్' పదవికి మాత్రమే విరమణ - ప్రజాసేవకు కాదు : కేటీఆర్
Telangana Sarpanch Tenure Ends On February 01 2024 : ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల(Sarpanch Last Date) వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇచ్చింది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగగా, ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది.