Teachers Transfer Schedule details : రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు ప్రారంభం కానున్నాయి. పదవీ విరమణకి 3 ఏళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు నిచ్చింది. మల్టీ జోన్ 1లో రేపటి నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు. అలాగే మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపొయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.
టీచర్ బదిలీల షెడ్యూల్ విడుదల - ఎప్పటినుంచంటే - Teachers Transfer Schedule
Teachers Transfer Schedule 2024 : కోర్టు కేసులతో నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈనెల 30వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
Published : Jun 7, 2024, 7:32 PM IST