ETV Bharat / state

కరీంనగర్‌లో జోరుగా భూ కబ్జాలు - అక్రమార్కులకు కళ్లెం వేస్తున్న పోలీసులు - land possession in karimnagar

Government Lands Possession Cases : భూముల ధరలకు రెక్కలొచ్చిన వేళ అక్రమార్కులు యథేచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. అధికారుల అండదండలతో అమాయకులకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు శివారు గ్రామాలు నగర పాలక సంస్థలో విలీనమైనప్పుడు రికార్డులను కార్పొరేషన్‌కు అప్పగించకుండా సర్కారు భూముల్ని కాజేశారనే ఆరోపణలు కోకొల్లలు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదనే ఆవేదన స్థానికుల్లో ఉంది. అయితే, కొత్తగా వచ్చిన సీపీ అభిషేక్‌ మహంతి ప్రత్యేక దృష్టి సారించడంతో వెయ్యికి పైగా ఫిర్యాదులు రావటం సంచలనంగా మారింది.

Police on Land Possession in Karimnagar
Government Lands Possession Cases
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 10:50 AM IST

Government Lands Possession Cases : కరీంనగర్‌ అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వ భూములను వెంచర్లుగా మారుస్తుండటంతో రేకుర్తి గ్రామం భూకబ్జాలకు నెలవుగా మారింది. నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు, రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబరు, విద్యుత్‌ మీటర్లు కేటాయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతం రేకుర్తిలోని సర్వే నెంబర్‌ 55లో 16 ఎకరాల భూమి రికార్డుల్లో ఉండగా, ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురైంది.

గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రేకుర్తి 2019లో కార్పొరేషన్‌లో విలీనం అయింది. పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే కబ్జాల పర్వం సాగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేములవాడకు చెందిన ఓ వ్యాపారికి లేని భూమిని ఉన్నట్లు కాగితాలు సృష్టించి, రూ.కోటి 37 లక్షలకు రేకుర్తి కార్పొరేటర్‌ భర్త కృష్ణగౌడ్‌ విక్రయించాడు. మోసం గ్రహించిన బాధితుడి ఫిర్యాదుతో విచారించిన సీపీ(CP)అభిషేక్​ మహంతి కృష్ణగౌడ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరోవైపు 137వ సర్వే నెంబర్‌ ఎరికలగుట్టలో 42 ఎకరాల ప్రభుత్వ భూమిలోనూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు.

'ఇక్కడ ఉన్నట్టువంటి కొంత మంది ఎస్సీలకు పూర్వకాలంలో సేద్యానికి ఉపయోగపడే భూమి కొంత భాగమే వాళ్లకు కేటాయించారు. మిగతా భూమి 10 నుంచి పదిహేను మంది సుంకర వాళ్లకు గతంలో పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇక మిగతా భూమికి హద్దు లేకుండా నచ్చిన విధంగా కబ్జాలు చేసుకున్నారు కొందరు'- డి.మారుతి, న్యాయవాది

Police on Land Possession in Karimnagar : నద్దీనాలా, డీ94 (D94) భూముల్లో ఏకంగా ఇళ్లను నిర్మించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై పలుమార్లు కలెక్టర్‌, ఆర్డీవోలకు(RDO) ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ ఇంతవరకు సర్కారు స్థలాలకు హద్దులు ఖరారు చేయకపోవడం కబ్జాదారులకు అదనుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ మహంతి, ఎకనామిక్‌ అఫెన్సెస్‌(economic offences) బృందాలను ఏర్పాటు చేయడంతో వందల సంఖ్యలో బాధితులు ఫిర్యాదులు చేశారు. వాటి ఆధారంగా ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

'137 సర్వే నెంబర్​ ఎరికలగుట్ట ఇందులో నేను లోకాయుక్తలో కంప్లైంట్​ చేశా. 212600 కేసు నెంబరు దీని మీద లోకాయుక్త నుంచి విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వాళ్లు కూడా దర్యాప్తు చేసి ఇది అన్యాక్రాంతమైందని రిపోర్ట్​ ఇచ్చారు. అదేవిధంగా 56 సర్వే నెంబరు కూడా రిపోర్టు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు'- దుర్గం మనోహర్‌, సామాజిక కార్యకర్త

కరీంనగర్‌లో జోరుగా భూకబ్జాలు - అక్రమార్కులకు కళ్లేం వేస్తున్న పోలీసులు

గిట్టుబాటు ధర కోసం పల్లి రైతుల కష్టాలు - చోద్యం చూస్తున్న మార్కెటింగ్​ శాఖ

కరీంనగర్​ స్మార్ట్​సిటీ నిధుల దుర్వినియోగంపై సర్కార్‌ ఫోకస్ - తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులపైనా విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.