Jobs in Medical Department : వైద్య, ఆరోగ్య, కుటంబ సంక్షేమ శాఖలోని(Medical Department) 5348 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ నెల 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ మేరకు జీఓని విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్ , డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించింది. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాని స్ఫష్టం చేసింది. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి, నేరుగా ఖాళీగా భర్తీ చేపట్టాలని తెలిపింది.
Polycet Entrance Exam Postponed : పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్(Polycet-2024) ప్రవేశపరీక్ష వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మే 17న జరగాల్సిన పరీక్షను మే 24కు మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - పోస్టుల వివరాలు ఇవే
కానిస్టేబుల్ అభ్యర్థుల నకిలీ బోనఫైడ్ల కలకలం- 60మందికి శిక్షణ నిలిపివేత