ETV Bharat / state

వైఎస్సార్సీపీ అరాచక 'బంటు'లపై డేగ కన్ను - చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం - Govt Focus on YSRCP Anarchies

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 7:14 AM IST

Government Focus On YSRCP Anarchy During Jagan Rule: వైఎస్సార్సీపీ హయాంలో కొనసాగిన దాష్టీకాలు, అరాచకాలు, అక్రమాలు రాజకీయ హత్యలకు సహకరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టాలు, నిబంధనలను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నేతలకు బంటుల్లా పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెట్టి వేధించిన వారి జాబితాను సిద్ధం చేస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది.

Government Focus On YSRCP Anarchy During Jagan Rule
Government Focus On YSRCP Anarchy During Jagan Rule (ETV Bharat)

Government Focus On YSRCP Anarchy During Jagan Rule : కరోనా వేళ మాస్క్‌ అడిగినందుకు దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మొదలు తన అక్కను వేధిస్తున్న వైఎస్సార్సీపీ మూకల్ని ప్రశ్నించినందుకు వారి చేతిలో హత్యకు గురైన పద్నాలుగేళ్ల బాలుడు అమర్‌నాథ్‌గౌడ్‌ కేసు వరకూ అన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది.

ఆ అధికారులపై చర్యలు : వైఎస్సార్సీపీ నాయకుడి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న చదువులు తల్లి మిస్బాను ఆత్మహత్య చేసుకునే వరకూ వేధించటం, మాస్క్‌ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ చావుకు కారణమవ్వటం, దొంగతనం కేసులో ఇరికించి, హింసించి అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు బాధ్యులవ్వటం వంటి ఘటనలన్నింటిపైనా పోలీసు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దళిత డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యాన్ని అంతమొందించి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసును ఎలా నీరుగార్చారు? దీనికి ఎవరు బాధ్యులు అనే సమాచారాన్ని తీసుకుంటున్నారు. ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలపై సాగిన తీవ్ర అణచివేత, హింసాత్మక ఘటనలన్నింటిని సమీక్షించి, వాటిల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

వైఎస్సార్సీపీ అరాచకాలపై ప్రభుత్వం దృష్టి - శాఖల వారీగా రిపోర్టులు - ap Govt Focus on YSRCP Anarchies

చంద్రబాబు నివాసంపైకి జోగి దండయాత్ర : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండున్నరేళ్లవుతున్నా ఒక్కర్ని కూడా ఎందుకు అరెస్టు చేయలేదనే విషయాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. సీసీ ఫుటేజీ దృశ్యాల్లో దాడుల చేసిన వారెవరో స్పష్టంగా తెలుస్తున్నా సరే వారిని ఎందుకు గుర్తించలేదని పోలీసు అధికారులను ప్రశ్నిస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి నాటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వందలాది మందిని వేసుకుని దండయాత్రగా వెళ్లి దాడికి తెగబడితే ఏ ఒక్కర్నీ ఎందుకు అరెస్టు చేయలేదని అధికారుల్నీ నిలదీస్తోంది. ఆ దాడుల వెనక ఉన్న శక్తులెవరనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

వైఎస్సార్సీపీకి నాలుగో సింహం దాసోహం - అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులే

వీటితో పాటు గన్నవరం, మాచర్లలో టీడీపీ కార్యాలయాలపై దాడి, దహనం చేసిన కేసులను ఎవరు నిర్వీర్యం చేశారనేది ఇప్పటికే గుర్తించింది. మాచర్లలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా రాష్ట్ర వ్యాప్తంగా గత అయిదేళ్లలో జరిగిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల హత్య కేసులు, జరిగిన దాడుల కేసుల పురోగతి, ప్రస్తుత స్థితిపై పోలీసు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను నివేదికలు అడిగారు. అవసరమైతే వాటిపై పునఃవిచారణ జరపాలని భావిస్తున్నారు.

నివేదికలు సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలను అక్రమంగా స్వాధీనం చేసుకుంది. దీనిలో కొంతమంది అధికారులు భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల్లో పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు కొంతమంది ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిపైనా సమగ్ర నివేదిక రూపొందించి ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.

వైఎస్సార్సీపీ అనుబంధ సంస్థలా పోలీస్​ వ్యవస్థ- ఏపీలో 'వైసీపీ సెక్షన్​'లు అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.