ETV Bharat / state

ఇంటర్ అర్హతతో ఆర్మీలో కొలువులు - బీటెక్​ కోర్సుతో పాటు లెఫ్టినెంట్​ జాబ్​

ఆర్మీలో చేరాలనుకునే అవివాహిత పురుషులకు గోల్డెన్​ ఆఫర్​ - లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం - ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన

Join Indian Army
Join Indian Army (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 3:52 PM IST

Indian Army TES Notification 2024 : ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఆర్మీలో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకు ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ (టీఈఎస్​) నోటిఫికేషన్ దారి చూపుతుంది. ఈమేరకు జులై 2025లో ప్రారంభమయ్యే 53వ టీఈఎస్‌ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. సెలెక్ట్​ అయిన వారికి బీటెక్‌ కోర్సు సహా లెఫ్టినెంట్‌ కొలువులకు ఉచిత శిక్షణ అందుతుంది. జాబ్​లో చేరినవారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది. ఇందుకోసం అర్హతగల అభ్యర్థులు​ నవంబర్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి.

ఆర్మీ(టీఈఎస్​) నోటిఫికేషన్​ వివరాలు :

*టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 కోర్సు (టీఈఎస్‌)- జులై 2025
ఖాళీలు : 90

అర్హత :

గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్​/10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024 స్కోర్​ తప్పనిసరి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు :

16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2006 - జనవరి 1, 2009 మధ్య జన్మించినవారే అర్హులు.

ఎంపిక విధానం :

జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 ఎగ్జామ్స్​, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
కోర్సు, శిక్షణ :

మొత్తం అయిదేళ్లు కోర్సు, ట్రైనింగ్​ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ శిక్షణ, నాలుగేళ్లు టెక్నికల్‌కు సంబంధించి ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌) డిగ్రీ పట్టా అందజేస్తారు.

ఆన్‌లైన్ అప్లికేషన్​కు చివరి తేదీ : 06-11-2024.

ప్రధానాంశాలు :
* 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు శిక్షణలో ఎంట్రీకి సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌ మోడ్​లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • ఈ నోటిఫికేషన్​ మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్​ క్లిక్​ చేయండి.

Indian Army TES Recruitment Notification

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.