Gold Seized at Miryalaguda in Nalgonda District : పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న TS09 UE 2479 నెంబరు గల బొలెరో వాహనంలో రూ.5 కోట్ల 73 లక్షల విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఆక్రమ రవాణాకు చెక్ పెట్టాడానికి జిల్లా పోలీసు యాంత్రాంగం పటిష్ఠ నిఘా పెట్టిందని తెలిపారు. దీనిపై ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు.
మరోవైపు వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో మధు అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా నిలువచేసిన రూ .1,62000ల విలువ గల 173 లీటర్ల మద్యం సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమ మద్యం పంపిణీ చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
'దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి' - స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’ - సుప్రీంకోర్టులో కవిత పిటిషన్