Gold Price in Telangana Today : రోజురోజుకు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి అమాంతం కొండెక్కింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 10 గ్రాములకు 67 వేల రూపాయలు ఉంది. దీన్ని ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా భావించడం కూడా పెరుగుదలకు ఒక కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి.
యూఎస్(US) ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తుండటం, ఆర్థిక అనిశ్చితి నెలకొనడం కూడా బంగారం పెరుగుదలకు కారణం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై 2 వేల రూపాయల వరకు పెరిగింది. జూన్‌లో మరోసారి ఫెడ్ పాలసీ విడుదలైతే మరికొంత పెరిగే అవకాశం ఉంది. ధర పెరిగినా వినియోగదారుల కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.
'బంగారం ధర పెరుగుతోంది కానీ ప్రస్తుతానికి తగ్గే ప్రసక్తే అయితే కనిపిస్తలేదు. ఒక అడుగు వెనక్కి పడినా గ్యారెంటీగా రెండు, మూడు అడుగులు ముందుకే వెళ్తుంది. మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 5వ తేదీ ధరకు ఇవాల్టి ధరకు 2 వేల తేడా ఉంది. ప్రజల్లో ఉండే కొంత అవగాహన మారింది. ఇంతకముందు ప్రజలు కేవలం పెళ్లిళ్లకు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్లాగా చూస్తున్నారు. ఆదాయం కింద బంగారం తీసుకుని, ఎప్పుడైనా కావాలంటే లాభం పొందవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఆలోచన ధోరణి వచ్చింది. దీని వల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది.' - ప్రతాప్, బులియన్ మార్కెట్ నిపుణులు
Gold Rate Increased in India : విదేశాలు సైతం పసిడి నిల్వ చేసుకుంటున్నాయి. డాలర్ విలువ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బంగారాన్నే ఒక వనరుగా దాచుకుంటున్నారు. క్రిఫ్టో(Crypto)లో పెట్టుబడులు, కొంత మంది స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, మరికొంత మంది స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడుతుంటారు. స్వర్ణంతో సులభంగా పెట్టుబడికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం పది గ్రాముల ధర మరో నాలుగైదు నెలల్లో 70 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది.
'బంగారాన్ని మనం ఎలా అయితే దాచుకుంటున్నామో అలానే దేశాలు కూడా దాచుకుంటున్నాయి. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో డాలర్ పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. అటువంటి అప్పుడు మిగిలిన వనరు ఏంటంటే బంగారం. ప్రతిదేశం కూడా బంగారాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తోంది. మన రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారం కొనుగోలు చేసి దాచింది. దేశం ఎలా ఆలోచిస్తుందో ప్రజలు కూడా అలా ఆలోచిస్తున్నారు. బంగారం వల్ల నష్టం ఉండదని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. -'ప్రతాప్, బులియన్ మార్కెట్ నిపుణులు
అలర్ట్ - త్వరలో బంగారం ధర రూ.70వేలకు పెరిగే ఛాన్స్ - కారణం ఏమిటంటే?
ఏం తెలివి భయ్యా నీది - నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు దోచేశాడుగా