Gold Man Konda Vijay kumar Visited Yadadri : సాధారణంగా భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర లేదు. ఒంటిపై బంగారం ధరిస్తే ఆ లుక్కే వేరు. శుభకార్యాలలో ఎంత బంగారం ధరిస్తే అంత క్రేజ్. అందుకే మనవాళ్లు అంటారు 'బంగారం కొద్దీ సింగారం' అని. మరికొందరు తమకు పుత్తడిపై ఉన్న ఇష్టంతో కిలోల కొద్దీ నగలతో దర్శనమిస్తున్నారు. ఇలాంటి వ్యక్తే ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన బంగారు బాబుగా పేరున్న కొండ విజయకుమార్ ఇవాళ యాదాద్రి స్వామి దర్శనానికి వచ్చారు.
తెలంగాణ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్న విజయ్ కుమార్ సుమారు 8 కిలోల విలువైన నగలతో నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులను ఆకట్టుకున్నారు. ఇంకేముంది ఈ బంగారు బాబుతో సెల్ఫీలు కావాలని చాలామంది పోటీపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవటం చాలా అదృష్టం అని కొండ విజయ్ కుమార్ తెలిపారు. 2016 నుంచి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్వామి దయతో ఆ సేవలను మరింత విస్తృతము చేయనున్నట్లు కొండ విజయ్ కుమార్ చెప్పారు.
శ్రీవారి సేవలో 25 కేజీల గోల్డెన్ ఫ్యామిలీ : మరోవైపు గత నెలలో కూడా ముంబయికి చెందిన ఓ కుటుంబం సుమారు 25 కేజీల బరువుంటే బంగారు ఆభరణాలను ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో ఇద్దరు 10 కేజీల చొప్పున బంగారాన్ని ధరించగా, మరొకరు 5 కేజీల బంగారాన్ని అలకరించుకున్నారు. బంగారు ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి తిరుమల దర్శనానికి రావడంతో ఒకింత భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారిని ఆసక్తిగా చూస్తూ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. వారు సైతం అడిగిన వారికి చిరునవ్వుతో సెల్ఫీలు ఇస్తూ ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. దాదాపు వారికి రక్షణగా 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం మరో విశేషం. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంత పెద్ద బ్రాస్లెట్ మీరెప్పుడైనా చూశారా? - విలువ తెలిస్తే షాక్!
స్పెషల్ అట్రాక్షన్‌గా బిహార్ 'గోల్డ్ మ్యాన్' బుల్లెట్- అంతా బంగారమే! - Gold Man Of Bihar