ETV Bharat / state

చికెన్ కబాబ్​తో మీకు 'మయోనైజ్' ఉండాల్సిందేనా? - ఇకపై హైదరాబాద్​లో ఆ చట్నీ దొరకదు!

మయోనైజ్​పై నిషేధం విధించే దిశగా జీహెచ్​ఎంసీ చర్యలు - అనుమతివ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ - వరుస ఘటనలతో అప్రమత్తమైన బల్దియా

Mayonnaise
GHMC to Ban on Mayonnaise (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

GHMC to Ban on Mayonnaise : మండి బిర్యానీ, చికెన్ కబాబ్​, పిజ్జాలు, బర్గర్లు, శాండ్​విచ్​లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చట్నీలా వేసుకుని ఆహారప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్​పై నిషేధం విధించేందుకు జీహెచ్​ఎంసీ రంగం సిద్ధం చేస్తుంది. ఇటీవల వెలుగు చూస్తున్న వరుస ఘటనలతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నిసార్లు హెచ్చరించినా హోటళ్ల నిర్వాహకులు తీరు మార్చుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. నగరంలో మయోనైజ్​ను నిషేధించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

వరుస ఘటనలతో అప్రమత్తం : చాంద్రాయణగుట్ట, కాటేదాన్, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రోస్టేషన్‌లోని ఓ హోటల్‌లో, బంజారాహిల్స్‌లోని కొన్ని హోటళ్లలోని షవర్మా, మండి బిర్యానీ, బర్గర్లపై బల్దియాకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్​లోని ప్రముఖ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్బుల్లో జరిపిన తనిఖీల్లో నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు.

అల్వాల్‌లోని ఓ హోటల్​లో మయోనైజ్​ తిన్న కొందరు యువకులు ఆసుపత్రి పాలయ్యారు. వారం రోజుల కిందట ఐదుగురు విరేచనాలు, వాంతులతో స్థానిక హాస్పిటల్​లో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాసిరకం మయోనైజ్​ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనూ ఆ హోటల్​లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. షవర్మా తిన్న 20 మందికి పైగా యువకులు మూడు, నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రుల్లో చేరారు. కొంతమందికి రక్త పరీక్షలు చేయగా, వారి బ్లడ్​లో హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు హోటల్​లో షవర్మాపై బల్దియాకు ఫిర్యాదులు అందాయి.

ఇదే కారణం : మయోనైజ్ ఉడికించని పదార్థం కావడంతో ఇందులో హానికర బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఈ కారణంగానే దీనికి నిషేధించి, శాఖాహార పదార్థాలతో తయారు చేసే మయోనైజ్​ను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఓ అధికారి వెల్లడించారు.

తయారీలోనే చెప్పలేనంత నిర్లక్ష్యం : సాధారణంగా మయోనైజ్‌ను తయారు చేయడానికి గుడ్డులోని పచ్చ సొన, నూనె, నిమ్మరసం, ఉప్పు వాడతారు. ఈ క్రమంలోనే చాలా మంది శుభ్రతను పక్కనపెట్టేస్తున్నారు. ఇలా అపరిశుభ్ర వాతావరణంలో, ఇష్టమొచ్చినట్లుగా తయారు చేసిన మయోనైజ్ ఆరోగ్యానికి హానికరమని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం చెబుతోంది. పరిశుభ్రంగా తయారైన మయోనైజ్‌ను మాత్రమే తినేందుకు ఉపయోగించాలని, అది కూడా తయారైన 3 నుంచి 4 గంటల్లోపే దాన్ని వాడాలని సూచిస్తోంది.

ఆ హోటల్​లో షవర్మా తిన్నారా? అయితే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది!

'షవర్మా'పై బ్యాన్​.. మేయర్​ ఆదేశాలు.. త్వరలో మరిన్ని నగరాల్లోనూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.