ETV Bharat / state

అర్ధరాత్రి యువకుల గ్యాంగ్​వార్​ బీభత్సం - రెచ్చిపోయిన గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు - ఎక్కడంటే? - GANG WAR IN YANAMALAKUDU KRISHNA

కత్తులు, బీరుసీసాలతో పరస్పర దాడులు - బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు ఉన్నట్టు అనుమానం- యనమలకుదురులో ఘటన

Etv BharatGang war in Yanamalakudu Krishna In AP
Gang war in Yanamalakudu Krishna In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 10:32 AM IST

Gang war in Yanamalakudu Krishna In AP : ఏపీలోని కృష్ణా జిల్లా యనమలకుదురులో మంగళవారం అర్ధరాత్రి యువకుల మధ్య చోటు చేసుకున్న గ్యాంగ్‌వార్‌ బీభత్సం సృష్టించింది. కొంతకాలంగా రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు చాపకింద నీరులా ఉండగా, మంగళవారం రాత్రి ఒక్కసారిగా బహిర్గతమైంది. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులకు తెగబడడంతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. దాడుల్లో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. పలువురు కత్తి పోట్లకు గురయ్యారు. కత్తులు, చాకులు, బీరు సీసాలతో తలపడినట్లుగా సమాచారం. దాడులు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే పోలీస్‌ ఇంటర్‌ సెక్టార్‌ మొబైల్‌ అక్కడకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. కత్తిపోట్లకు గురైన వారు హాస్పిటల్​ పాలయ్యారు.

పాత కక్షల నేపథ్యంలో : పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు వశిష్ట కాలనీ ప్రాంతానికి చెందిన గుడివాక రాహుల్‌కు తాడిగడప చెరువు కట్ట ప్రాంతంలో నివసించే పెదపూడి మనోజ్‌కుమార్‌ అలియాస్‌ టోనీల మధ్య కొంతకాలంగా వివాదాలు నెలకొన్నాయి. రాహుల్‌ ఇంటర్‌ అనంతరం కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొంటుండగా, టోనీ నగర సమీపంలో ఓ కళాశాలలో బీటెక్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఈ ఇద్దరూ కొందరు యువకులతో వర్గాలను నడుపుతుండగా, గత కొంత కాలంగా వీరి నడుమ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇరువర్గాల మధ్య ఘర్షణ : నవంబర్ 3వ తేదీన ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అప్పటికి వివాదం సద్దుమణిగిందనుకుంటే మంగళవారం రాత్రి వీరి మధ్య మరోసారి గొడవ జరగడంతో రెండు వర్గాలు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని యనమలకుదురు పెట్రోలు బంకు వద్దకు రావాలంటూ సవాల్​ విసిరి రెచ్చగొట్టుకున్నారు. చంపేస్తామంటూ సవాళ్లు విసురుకుంటూ పెట్రోల్​ బంక్ వద్దకు చేరుకొన్నారు. వెంట చాకులు, కత్తులు, బీరు సీసాలు లాంటివి తీసుకు రాగా, 2 గ్యాంగులకు చెందిన 20 మంది వరకు పరస్పర దాడులకు దిగారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

ఒకరిపై ఒకరు ఫిర్యాదు : వీరు హాస్పిటల్​లో చికిత్స పొందుతూ బుధవారం పెనమలూరు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేసుకొన్నారు. ఇరువర్గాల దాడుల్లో టోనీ, సంతోష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన మనోజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సతీష్, విన్ను, ప్రేమ్, బుడియ్య, దర్శి వెంకటసాయికుమార్, రవితేజ, ఉప్పెర్ల సాయికుమార్, జగదీష్, మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే మరో వర్గానికి చెందిన గుడివాక రాహుల్‌ ఫిర్యాదు మేరకు మనోజ్‌ అలియాస్‌ టోని, సంతోష్, చందు, దినేష్‌ అలియాస్‌ పండు, కిరణ్‌ అలియాస్‌ ఘని, భాగ్యరాజ్, మరికొంత మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిందితుల్లో కొందరు గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లకు చెందిన వారున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిలో 9 మందిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్నవారి కోసం ఓ స్పెషల్ టీం గాలిస్తోంది.

మద్యం మత్తులో గ్యాంగ్​ వార్.. తెగిపడిన చేతిని ఎత్తుకెళ్లిన వీధికుక్క

అమ్మాయిల గ్యాంగ్​వార్​.. నడిరోడ్డుపై జుట్లు పీక్కొని ఫైటింగ్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.