ETV Bharat / state

YUVA : పేదింటి పెన్సిల్​ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh - PENCIL ARTIST GANESH

Drawing Artist Ganesh Story : మధ్యలోనే ఆగిపోయిన చదువు, మీద పడిన కుటుంబ బాధ్యతలు. కష్టాలు, కన్నీళ్లు. పాతికేళ్ల జీవితంలో ఆ యువకుడు చూసింది ఇవే. ఇంతటి ఇబ్బందుల్లోనూ తన సహజ సిద్ధ కళానైపుణ్యాన్ని మరవలేదు. ఎక్కడా మెళకువలు నేర్చుకోకున్నా కళాత్మకత జోడిస్తూ ప్రతీ చిత్రం అందంగానూ, అపురూపంగానూ గీస్తున్నాడు. ఆ ప్రవృత్తినే ఉపాధిగా మలుస్తూ ఆదాయమూ అందుకుంటున్నా డు. ఇంతకీ ఎవరా యువ కళాకారుడు? ఏంటా తన ప్రత్యేకత అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.

Pencil Artist Ganesh Story
Drawing Artist Ganesh Story (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 4:39 PM IST

Updated : Jun 5, 2024, 11:12 AM IST

పేదింటి పెన్సిల్ అర్టిస్ట్- డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు (ETV BHARAT)

Pencil Artist Ganesh Story : కష్టాలు, కన్నీళ్లు, కుటుంబ పోషణ ఇవన్నీ ఆయువవకుని కల ముందు చిన్నబోయాయి. ఎన్ని కష్టాలు వచ్చిన తనలో ఉన్న దృఢసంకల్పం తన కలకు ఊపిరి పోస్తోంది. చూస్తున్నారుగా ఈ చిత్రాలు ఎంత బాగా గీశాడో కదా! మెుబైల్‌లో ఫొటో పంపిస్తే చాలు. అచ్చం అలాంటి బొమ్మనే గీసేస్తున్నాడు. అలా అని మనోడేం పెద్ద కళాకారుడు కాదండోయ్‌! ఓ మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. కష్టాలను దిగమింగుకుని కన్నతల్లికి అండగా ఉంటున్నాడు. మరోవైపు తన చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా

చిత్రాన్ని గీయడంలో తనకు తానే దిట్ట అనిపించుకుంటున్నాడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడు. తాను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిగ్రీ చడుతుండగా తండ్రి మృతి చెందాడు. తల్లి నాగవ్వ, పెద్దమ్మ లక్ష్మి ఒకేచోట నివసిస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. తల్లి బీడీలు చేస్తూ కుటుంబ పోషణ జరుపున్నది. గణేష్ చదువు మాని పెట్రోల్ పంపులో పనిచేస్తూ తల్లికి చెదోవాదోడుగా మారాడు.

అయితే చిన్ననాటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. దేవత మూర్తులు, సినిమా కళాకరులు, క్రీడాకారులు, సాధారణ వ్యక్తులు ఇలా ఎవరి చిత్రమైన సరే ఇట్టే వేసేస్తాడు. ఆ కల తనకు భారంగా మారద్దనుకున్నాడు. సరదాగా వేసే కళాకృతులను ఉపాధిలో భాగంగా మలుచుకున్నాడు. పుట్టిన రోజుకు, పెళ్లిళ్లకు బహుమతులు అందజేయాలనుకునే వారికి చిత్రాలు గీసిస్తూ సంపాదనగా మార్చుకున్నాడు. ఈ కలను ఇలాగే కొనసాగిస్తూ ఏదో ఒక రోజు ఓ గొప్ప గుర్తింపు పొందాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ యువకుడు.

"నాన్న మృతి తర్వాత కుటుంబ పోషణ భారంగా మారింది. బంధువులు సైతం దూరమయ్యారు. చదువుకుంటూ పనిచేయటం కష్టమని భావించాను. పెట్రోల్ పంపులో ఉద్యోగం చేసుకుంటూ అమ్మకు చేదోడు వాదోడుగా నిలిచాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఆర్ట్ మాత్రం మరువలేదు. ఆర్ట్ వేయడంతోనే మంచి గుర్తింపు సాదించాలని పట్టుతో ఉన్నాను". - గణేష్ కళాకారుడు

"చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం గణేష్‌కు చాలా ఇష్టం. మొదట్లో మేము వద్దన్నాం. కాని మా మాట వినలేదు. సరే తన ఇష్టాన్ని ఎందుకు వద్దనాలని ఊరుకున్నాము, కాని అది ఇప్పుడు ఆ బొమ్మలు వేయడం మా కుటుంబ పోషణలో భాగమయ్యింది. ఉదయం బయట ఉద్యోగం చేస్తూ, ఇంటికి వచ్చాక బొమ్మలు వేస్తూ మాకు బాసటగా నిలిచాడు. మా బాబు మంచి భవిష్యత్తు లభించాలన్నదే మాకోరిక". - నాగవ్వ, గణేష్ తల్లి

4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

'ఇంజినీర్లు, డాక్టర్లు చాలా ఉన్నారులే నాన్న - నేను కళారంగం వైపు అడుగేస్తా'

Last Updated : Jun 5, 2024, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.