Funny Scene Between PM Modi and CM Revanth : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగించుకొని దిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ(PM Modi), సీఎం రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో తీసిన ఆ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ప్రధానిని హస్తినకు సాగనంపే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు విమానం వద్ద పీఎం గురించి వేచి ఉన్నారు. అప్పుడే విమానం ఎక్కడానికి వస్తున్న పీఎం మోదీకి వీడ్కోలు చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూలగుచ్ఛం ఇచ్చారు. పుష్పగుచ్చం అందుకున్న ప్రధానికీ, సీఎం రేవంత్‌కు మధ్య ఏదో సరదా సంభాషణ జరిగింది. ఈ మాటలతో మోదీతో సహా అక్కడే ఉన్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు గట్టిగా నవ్వుకున్నారు. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఏం జరిగి ఉంటుందనే విషయంపై నెటిజన్లు రకరకాలుగా తమ ఊహాగానాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు.
'ఆదిలాబాద్ వేదికగా మోదీ, రేవంత్‌ల బడే భాయ్, చోటా భాయ్ బంధం బహిర్గతమైంది'
PM Modi Telangana Tour : రెండు రోజుల తెలంగాణ పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీ(PM Modi Tour) మొదటిరోజైన మార్చి 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్వహించిన అధికార కార్యక్రమాల్లో భాగంగా జరిగిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరై మోదీనీ పెద్దన్నగా ప్రశంసించారు. అనంతరం వారిద్దరి మధ్య కాసేపు ముచ్చట్లు జరిగాయి. అనంతరం ఆదిలాబాద్‌లో జరిగిన భారీ బహిరంగసభ మోదీ పాల్గొని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 400 సీట్లు తగ్గకుండా మెజారిటీ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉండడంతో అక్కడి వెళ్లి మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
Two Day PM Modi Telangana Tour End : ఆ తర్వాత రోజు మార్చి 5న జరిగిన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్నింటికీ ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ(BJP Public Meeting)లో బిజీగా గడిపారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి నేరుగా దిల్లీ పయనమయ్యారు.
వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నా - అందుకే వారికి భయం పట్టుకుంది : మోదీ
రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్‌వేలా నిలుస్తుంది : మోదీ