Funds Misuse in TSPHCL : తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో (టీఎస్‌పీహెచ్‌సీఎల్) నిధుల దుర్వినియోగం (Funds Misuse) వ్యవహారం కలకలం రేపుతోంది. సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న ఓ కార్పొరేషన్ ఛైర్మన్ గృహానికి మరమ్మతుల పేరిట రూ.లక్షల్లో సొమ్ము వెచ్చించేందుకు ప్రతిపాదనలు రూపొందించడం విస్తుగొలుపుతోంది. రూ.లక్షల నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై అంతర్గతంగా విచారణ సాగుతోంది.
Officers Investigation Funds Misuse in TSPHCL : తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (TSPHCL) నిర్మాణరంగంలో అపార అనుభవముంది. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లు, పోలీసు, అటవీ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక భవనాలను ఈ సంస్థ నిర్మించింది. అయితే ఓ కార్పొరేషన్ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంతో పాటు ప్రధాన కార్యాలయానికి కేటాయించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు సమాచారం.
ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాల స్మగ్లింగ్ విలువ రూ.100 కోట్లు
రాష్ట్ర విభజన అనంతరం ఆ కార్పొరేషన్ ఛైర్మన్‌కు సంబంధించి తెలంగాణలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికీ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే సదరు ఛైర్మన్ తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా దానికి మరమ్మతులతోపాటు టీవీ, ఏసీ, ఫర్నీచర్ పేరిట కార్పొరేషన్ నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడా విషయం కాస్తా వివాదాస్పద అంశానికి దారితీసింది.
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ
ఛైర్మన్ సొంత గృహాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అయినా టీఎస్‌పీహెచ్‌సీఎల్ ఇంజినీర్లు కార్పొరేషన్ నిధులను ఎలా కేటాయించారనే దానిపై విచారణ సాగుతోంది. క్యాంపు కార్యాలయానికి అధికారికంగా అనుమతి లభించలేదు. కానీ ఇలా చేయడంలో మతలబేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కార్పొరేషన్ హెడ్‌క్వార్టర్‌లో మరమ్మతుల పేరిట వెచ్చించిన నిధులు కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సుమారు రూ.50-60 లక్షల వరకు నిధులు దుర్వినియోగమయ్యాయనే (Misappropriation of Funds) ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
టాయిలెట్ల మరమ్మతులకు రూ.5.50 లక్షలా? : సదరు కార్పొరేషన్ ఛైర్మన్‌కు రూ.లక్ష జీతంతో పాటు ఇంటికి అద్దె కింద ప్రతి నెలా రూ.50,000లు ఇస్తున్నారు. కన్వేయన్స్ అలవెన్స్ కింద రూ.30,000లు, ఫ్యూయల్ ఛార్జీల కింద మరో రూ.15,000లు చెల్లిస్తున్నారు. ఆయన హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో ఉంటూ అద్దె తీసుకుంటున్నారు. ఆ ఆపార్ట్‌మెంట్‌నే క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్నారు.
- రెసిడెన్స్ కమ్ క్యాంప్ ఆఫీస్ రూఫ్ లీకేజీ మరమ్మతుల కోసం రూ.6.20 లక్షలు కేటాయించారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ మరమ్మతుల కింద మరో రూ.6.95 లక్షలను మంజూరుచేశారు.
- మరోసారి క్యాంపు కార్యాలయంలో వాల్‌పేపర్‌తోపాటు ఇతర సదుపాయాలకోసం రూ.10.3 లక్షలను, ఫర్నిచర్‌కోసం రూ.9.7 లక్షల్ని వెచ్చించారు.
- ప్రధాన కార్యాలయంలో టాయిలెట్ల మరమ్మతుల పేరిట ఏకంగా రూ.5.5లక్షలు ఖర్చు పెట్టారు. ఛైర్మన్ ఛాంబర్ మరమ్మతులకు మరో రూ.9.1 లక్షలు కేటాయించారు. వీటిల్లోనూ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం
వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్మాల్ - రూ.2 కోట్లు స్వాహా