Four Men Arrested for Cheating by Magic Box : విజ్ఞానశాస్త్ర పరిధి ఎంత విస్తరిస్తున్నా, కొంత మంది అమాయకులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఓ సినిమాలో చిత్రగుప్తుని చిట్టా ఆకాశం నుంచి కిందపడి, దాని వల్ల జరిగే ఎన్నో అద్భుత సన్నివేశాలు చూశాం. అలాంటి తరహాలోనే ఓ నలుగురు నిందితులు ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నాయని కొందరిని మోసం చేస్తూ, చివరికి కటకటాలపాలయ్యారు. జనగామ పోలీస్ స్టేషన్లో ఈ నెల 4న జరిగిన సమావేశంలో ఏసీపీ దామోదర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఉంటున్న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ (Amrabad) మండలం మున్ననూర్‌కు చెందిన కేతావత్ శంకర్, హయత్‌నగర్‌లో ఉంటున్న నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండా వాసి కొర్ర గాసిరాం అలియాస్ గాస్యలు, నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంఘంబండకు చెందిన ఖాసీం, తాండూరుకు చెందిన మహ్మద్ అజార్ ఈ నెల 3న ఆటోలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెంబర్తి జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.
Four Men Cheating People by Magic Box in Telangana : దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆకాశం నుంచి ఉల్కలు పడ్డప్పుడు ఓ మంత్రపు పెట్టె దొరికిందని, దాంట్లో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పి వరంగల్ (Warangal)కు చెందిన ఓ వ్యక్తికి రూ.50 కోట్లకు విక్రయించడానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో బయటపడింది.
పెట్టె కింది భాగంలో బ్యాటరీ లాంటిది అమర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దానిపై అయస్కాంతం పెట్టగానే అది వైబ్రేటింగ్ వచ్చేలా, ఇనుప వస్తువుతో రాయగానే నిప్పురవ్వల మాదిరిగా స్పార్క్ (Spark) వచ్చేలా రూపొందించారు. వీటిని తయారు చేసి పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. వారి నుంచి మంత్రపు పెట్టె, నాలుగు మొబైల్ ఫోన్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వెల్లడించారు.
కస్టమ్స్ ఆఫీసర్ పేరుతో 250మంది మహిళలకు గాలం- పెళ్లి పేరుతో మోసం- చివరకు చిక్కాడిలా!
స్విగ్గీలో కొత్త స్కామ్ - నమ్మి ఆ కాల్ అటెండ్ చేస్తే రూ.లక్షలు స్వాహా - బీ అలర్ట్!