Four Generation Of Sanagapadu Villagers Gathered At One Place : ఎవరింట్లో వాళ్లు కొత్త బట్టలు కట్టుకుని, పిండివంటలు ఆరగిస్తే పండగ ఆ ఇంటికే పరిమితం! అదే ఊరంతా చేరి, కష్ట సుఖాలు పంచుకుని, పడిపడి నవ్వుకుంటే పల్లెకే పండగొస్తుంది! ఈ దసరాకు ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరు అలాగే మురిసింది. నాలుగు దశాబ్దాల క్రితం ఊరొదిలిన వెళ్లిన వారి రాకతో సంబరపడింది. నాలుగు తరాల వారి ఆత్మీయ పలకరింపులతో పులకించింది. ఇది కదా అసలైన పండగంటూ ఆనందపడింది.
4 తరాల ఆత్మీయ సమ్మేళనం : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పండగ! దసరా రోజున ప్రతీఇంటా ఆనందం వెల్లివిరిస్తే ఇక్కడ ఊరుఊరంతా అనుబంధాలు అల్లుకున్నాయి. వీళ్లలో కొందరికి బంధుత్వం ఉన్నా అందరూ బాల్యమిత్రులే. వీళ్లంతా తరచూ ఫోన్లో పలకరించుకుంటున్నా, వాట్సప్‌లో చాటింగ్ చేస్తున్నా ఒకరినొకరు కలుసుకొని దశాబ్దాలు దాటింది. ఈ దసరాకి అందరూ కలిసే సరికి దీపావళి కూడా ముందే వచ్చినంత వేడుకైంది. ఒక్కొక్కకి ముఖం మతాబుల్లా వెలిగిపోయింది.
పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
వెల్లివిరిసిన ఆప్యాయతలు : ఇందులో దేశ,విదేశాల్లో స్థిరపడిన విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వృత్తిరీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడినా అందరూ పుట్టి పెరిగింది, ఓనమాలు దిద్దింది శనగపాడులోనే! ఈ దసరాకు అందరూ కలవాలని వాట్సప్‌లో అనుకున్నారు. ఈ ఊరి ఆడపడుచుల్నీ ఆహ్వానించారు. అనుకున్నట్టే అందరూ కలిశారు. చిన్ననాటి ఊసులు చెప్పుకున్నారు. అప్పటికి, ఇప్పటికీ, ఊళ్లో వచ్చిన మార్పులు ముచ్చటించుకున్నారు . బాల్యమిత్రుల కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసుకున్నారు.
ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు:చంద్రబాబు, లోకేశ్
అల్లుకున్న అనుబంధాలు : ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 600 మంది హాజరయ్యారు. ఊరితో తమకున్న తీపిగుర్తుల్ని నెమరువేసుకున్నారు. చిన్నప్పటి అల్లరి చేష్టల్ని గుర్తుచేసుకుని నవ్వుకున్నారు. కొన్నేళ్లు వెనక్కి వెళ్లి ఆనందంగా గడిపారు. కష్టసుఖాలు చెప్పుకుంటూ కలిసే భోజనాలు చేశారు. ఈ సమ్మేళనానికి ఇంత స్పందన వస్తుందనుకోలేదంటూ నిర్వాహకులు కూడా హర్షం వ్యక్తంచేశారు. ఇకపై ఏటా నిర్వహిస్తామని చెప్తున్నారు.
ఆత్మీయ కలయికలతో మళ్లీ కళ : శనగపాడు గ్రామస్థులను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభినందించారు. ఆ ఊరి అల్లుడిగా ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. వలసలతో వెలవెలబోతున్న పల్లెలకు ఇలాంటి ఆత్మీయ కలయికలు మళ్లీ కళ తెస్తాయని ఆయన అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఊరిపెద్దలను సన్మానించారు. ఊరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విజయవాడలో 'దసరా దాండియా' ఫెస్టివల్ - ఆకట్టుకున్న మహిళల నృత్యం