ETV Bharat / state

ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన స్కార్పియో - ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం - 4 Died In Accident at gadwal - 4 DIED IN ACCIDENT AT GADWAL

4 AP Residents Died In Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

4 AP Residents Died In Road Accident
4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 7:03 AM IST

Updated : Jun 1, 2024, 9:13 AM IST

4 Spot Dead in Car Accident at Jogulamba Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ నుంచి హైదరాబాద్​వైపు వెళ్తున్న స్కార్పియో కారు ముందు వెళుతున్న లారీని వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద సమయంలో కారులో వెంకటేశ్​ అతని భార్య పుష్ప, తల్లి లత, అతని పిల్లలు తరుణి, నందు, అక్క కవిత, మేనల్లుడు ఆదిత్య ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో వెంకటేశ్​, పుష్ప, లత, ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న కవిత, వెంకటేశ్ పిల్లలిద్దరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఆంధ్రప్రదేశ్​లోని ఆళ్లగడ్డకు చెందిన వారిగా భావిస్తున్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్​లో నివాసం ఉంటున్న వెంకటేశ్​ కుటుంబం, ఆళ్లగడ్డలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 1, 2024, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.