ETV Bharat / state

రామోజీరావు ఒక పోరాట యోధుడు- ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు: వెంకయ్యనాయుడు - Venkaiah Naidu paid tribute to Ramoji Rao - VENKAIAH NAIDU PAID TRIBUTE TO RAMOJI RAO

Venkaiah Naidu Paid Tribute to Ramoji Rao : రామోజీరావు స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్​లో ఫిలింసిటీలో ఉంచిన రామోజీ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Venkaiah_Naidu_Paid_Tribute_to_Ramoji_Rao
Venkaiah_Naidu_Paid_Tribute_to_Ramoji_Rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 8:07 PM IST

Updated : Jun 8, 2024, 8:21 PM IST

Venkaiah Naidu Paid Tribute to Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని కొనియాడారు. హైదరాబాద్​లోని ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా రామోజీతో తనకున్న బంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. స్వయంకృషితో కష్టపడిన రామోజీ అనేక రంగాల్లో విజయం సాధించారని గుర్తు చేశారు. ఆయన ఒక ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారని తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని, రామోజీరావు ఒక పోరాట యోధుడని పేర్కొన్నారు. అనంతరం తన ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు. నిత్యం ఉషోదయంతో అక్షర కిరణాలను తెలుగు లోగిళ్లకు పంపి, సమాజాన్ని జాగృతం చేసిన అక్షర క్రాంతి రామోజీరావు అని వెంకయ్యనాయుడు అన్నారు.

రామోజీరావు ఒక పోరాట యోధుడు- ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు: వెంకయ్యనాయుడు (ETV Bharat)

"రామోజీరావు ప్రతి మాట, ప్రతి చేత సమాజం పక్షమే వహించింది. సరైన సమయంలో దిశానిర్దేశం చేసింది. సమసమాజ నిర్మాణం దిశగా జాతిని జాగృతం చేసింది. భౌతికంగా వారు మనకు దూరమైనా, వారు నిర్మించిన బాటలు భవిష్యత్ తరాలను ప్రభావవంతమైన మార్గంలో ముందుకు నడుపుతూనే ఉంటాయి. వ్యాపార రంగంలో రామోజీ రావు నూతన ఆలోచనా విధానాలు, పాటించిన విలువలు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక బాధ్యతను గుర్తు చేశాయి. తెలుగు సినిమా రంగానికి విలువల దివిటీ పట్టి వారు చూపించిన నూతన మార్గం ఎంతో మంది నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ప్రమాణస్వీకారం తర్వాత రామోజీని కలుద్దామనుకున్నా - ఇంతలోనే ఇలా : పవన్‌ కల్యాణ్‌ ఉద్వేగం - Pawan Kalyan Tribute to Ramoji Rao

Venkaiah Naidu Tweet on Ramoji Rao : కళాత్మక వ్యాపారమైన సినిమాలకు, సామాజిక బాధ్యతను జోడించి రామోజీరావు చేసిన ప్రయోగాలు ప్రేక్షక జన నీరాజనాలు అందుకున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. భారతదేశ పత్రిక, సినిమా రంగాల్లో వారి కీర్తి అజరామరం అని తెలిపారు. తెలుగు జాతి వెలుగు పతాకమైన రామోజీరావు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక తరాలను ప్రభావితం చేశారని ప్రశంసించారు. భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.

ఈనాడు, ఈటీవీలో వచ్చిన వార్తల ద్వారా ఎంతో మంది తలరాతలు మారాయని వెంకయ్య గుర్తు చేశారు. తాడిత, పీడత జనుల పక్షాన నిలబడి వారు చేసిన అక్షర సేద్యం ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిందని చెప్పారు. తరచూ ఆయన్ను కలవటం, అనేక అంశాల గురించి వారితో కూలంకషంగా చర్చించటం వంటివి తన ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య సానుకూల వారధి నిర్మించటంలో ఎంతో తోడ్పడ్డాయని గుర్తు చేసుకున్నారు.

Nirmala Sitharaman Paid Tribute to Ramoji Rao : రామోజీరావు పార్థివదేహానికి కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. ఇటీవలే రామోజీరావు ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని అన్నారు. కేంద్రం తరఫున సంతాపం తెలపాలని మోదీ సూచించారని పేర్కొన్నారు.

రామోజీరావు మృతికి నివాళి- రాష్ట్రంలో రెండ్రోజులపాటు సంతాప దినాలు

Last Updated : Jun 8, 2024, 8:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.