KTR on Rythu Runa Mafi in Telangana : రైతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమానిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. రుణమాఫీ కాని రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని మండిపడ్డారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని, ఇచ్చేది పక్కన పెట్టి వాపస్‌పై దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్, ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ అని వ్యాఖ్యానించారు.
మాఫీకానీ రుణమాఫీ-రైతులను అనుమానిస్తున్న రేవంత్ సర్కార్
— KTR (@KTRBRS) August 29, 2024
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతొ కొత్త డ్రామా-ఇచ్చేది పక్కన భేట్టి వాపస్ పై ద్రుష్టి
మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్-ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్
కేసీఆర్ గారు రైతు రాజును రాజు చేస్తే-మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారు… pic.twitter.com/A9TN7elLws
రైతులకు మళ్లీ కష్టాలు : మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్ నేతలు అనుమానిస్తూ వేధిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలని ధ్వజమెత్తారు. సెల్ఫీ దిగి తాను రైతు అని అన్నదాత నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు. రుణమాఫీ చెయ్యలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందని ఎద్దేవా చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రావడంతో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే..
— KTR (@KTRBRS) August 29, 2024
ఈ కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత చిన్నచూపు ??
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా...
బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేది ??
రూ. 5900 కోట్లకు బకాయిలు చేరుకున్నా...
ప్రభుత్వంలో చలనం లేదు.. దరఖాస్తులకే దిక్కులేదు..
స్కాలర్ షిప్పులను… pic.twitter.com/BX3nYI32Ra
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత చిన్నచూపని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఉపకార వేతనాలు, ఇతర అంశాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా, బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేదని అడిగారు. 5900 కోట్ల రూపాయలకు బకాయిలు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని, దరఖాస్తులకే దిక్కులేదని మండిపడ్డారు.
స్కాలర్‌షిప్పులను పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్ధులకు రోజురోజుకూ అవస్థలు పెరుగుతున్నాయని, విద్యాసంస్థల యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవడంతో వసతిగృహాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని, ప్రభుత్వం వెంటనే బకాయిలన్నీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Over a year ago when Chinese Automaker BYD wanted to setup a Billion Dollar Factory in Telangana, the Union Government rejected the proposal
— KTR (@KTRBRS) August 29, 2024
The investment could have created thousands of jobs & revved up the nascent EV ecosystem in our country
Now, we are hearing news that… pic.twitter.com/CxsFriXget
మార్పు ఇప్పుడు ఎందుకో వివరించగలరా? : మరోవైపు గతంలో రాష్ట్రంలో చైనా కంపెనీ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చైనా బీవైడీ కంపెనీ బిలియన్ డాలర్ల కంపెనీ ఏర్పాటుకు యోచిస్తోందని చెప్పారు. కంపెనీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊపందుకునేదని, వేలాది ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు చైనా పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తారని కథనాలు వస్తున్నాయని, మార్పు ఇప్పుడు ఎందుకో కేంద్రం వివరించగలదా అని ప్రశ్నించారు.